• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • POINTS SHOULD KNOW ABOUT ENGINEERING MARVEL KALESHWARAM IN TELANGANA MS

ఇంతకుముందు అమెరికాలోని కొలరాడో.. ఇప్పుడు కాళేశ్వరం.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..

ఇంతకుముందు అమెరికాలోని కొలరాడో.. ఇప్పుడు కాళేశ్వరం.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..

కాళేశ్వరం ప్రాజెక్ట్

ఇంతకుముందు అమెరికాలోని కొలరాడో,ఈజిప్టు దేశంలోని గ్రేట్ మ్యాన్ మేడ్ రివర్ ఎత్తిపోతల పథకాలు ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల పథకాలుగా నిలిచాయి. ఈ రెండింటిని అధిగమించి ఇప్పుడు కాళేశ్వరం పేరు చరిత్రలోకి ఎక్కనుంది.

  • Share this:
    కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న సీఎం కేసీఆర్ కల నేడు సాకారం కాబోతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా,ప్రపంచమే అబ్బురపడే రీతిలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం నేడు జరుగుతోంది. దాదాపు రూ.80వేల కోట్ల వ్యయంతో 2016 మే 2న శంకుస్థాపన జరుపుకున్న కాళేశ్వరం అత్యంత తక్కువ సమయంలో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టుగా చరిత్రలోకి ఎక్కింది. ఇంతకుముందు అమెరికాలోని కొలరాడో,ఈజిప్టు దేశంలోని గ్రేట్ మ్యాన్ మేడ్ రివర్ ఎత్తిపోతల పథకాలు ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల పథకాలుగా నిలిచాయి. ఈ రెండింటిని అధిగమించి ఇప్పుడు కాళేశ్వరం పేరు చరిత్రలోకి ఎక్కనుంది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరాన్ని ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

    కాళేశ్వరం విశేషాలు :

    • దశాబ్దాలుగా వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి, ప్రాణహిత జలాలను తెలంగాణ జిల్లాలకు తరలించి 13 జిల్లాల్లోని 18 లక్షల 29 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు, మరో 18 లక్షల 50 వేల ఎకరాల ఆయకట్టు భూములకు కాళేశ్వరం ద్వారా సాగునీరు అందించనున్నారు.

    • జూలై నెలాఖరు వరకు మోటార్ల బిగింపు, మేడిగడ్డ బ్యారేజీ పూర్తి చేసి ప్రతీరోజూ 2టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నారు.

    • ఈ ప్రాజెక్టు ద్వారా పెద్దపల్లి జిల్లాలోని 30 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు

    • కాళేశ్వరం ద్వారా మొత్తం 1832కి.మీ మార్గం మేర నీటి సరఫరా.. ఇందులో కాలువల ద్వారా 1531కి.మీ మేర నీటి సరఫరా

    • కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సొరంగాల పొడవు 203కి.మీ

    • ప్రాజెక్ట్ పైప్ లైన్ పొడవు 98కి.మీ, మొత్తం లిఫ్టులు 20, పంప్ హౌజ్‌లు 19

    • కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయడానికి అవసరమయ్యే విద్యుత్ 4627మెగావాట్లు

    • కాళేశ్వరం ద్వారా హైదరాబాద్‌కు 30టీఎంసీల నీటి సరఫరా

    Published by:Srinivas Mittapalli
    First published:

    అగ్ర కథనాలు