Home /News /politics /

PM NARENDRA MODIS TWITTER ACCOUNT FOR PERSONAL WEBSITE HACKED SK

Narendra Modi: ప్రధాని మోదీ పర్సనల్ వెబ్‌సైట్ ట్విటర్ ఖాతా హ్యాక్..

జూన్ 30వ తేదీ నాటికి ప్రధాని మోదీ సేవింగ్స్ ఖాతాలో రూ.3.38 లక్షలు ఉన్నాయి. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఫిక్స్ డ్ డిపాజిట్ ఉంది. గత ఏడాది దాని విలువ 1,27,81,574. 2020 జూన్ 30 నాటికి దాని విలువ 1,60,28,039.

జూన్ 30వ తేదీ నాటికి ప్రధాని మోదీ సేవింగ్స్ ఖాతాలో రూ.3.38 లక్షలు ఉన్నాయి. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఫిక్స్ డ్ డిపాజిట్ ఉంది. గత ఏడాది దాని విలువ 1,27,81,574. 2020 జూన్ 30 నాటికి దాని విలువ 1,60,28,039.

''అవును ఈ ఖాతాను జాన్ విక్‌కు చెందిన బృందం హ్యాక్ చేసింది. మేం పేటీఎం మాల్‌ను య్యాక్ చేయలేదు.'' అని పేర్కొన్నారు.

    ప్రధాని మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్‌/యాప్‌కు చెందిన ట్విటర్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. narendramodi_in ఖాతాను గురువారం తెల్లవారుజామున తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంతే ఆ ఖాతా నుంచి రెండు వరుస ట్వీట్లు చేసి కలకలం సృష్టించారు. ''కరోనా కట్టడి కోసం అందరూ ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు క్రిప్టో కరెన్సీ రూపంలో విరాళాలు అదించండి. ఇండియాలో క్రిప్టో కరెన్సీ లావాదేవీలు ప్రారంభమయ్యాయి.'' అని మొదట ఓ ట్వీట్ చేశారు. ఆ తర్వాత మరో ట్వీట్ చేశారు. ''అవును ఈ ఖాతాను జాన్ విక్‌కు చెందిన బృందం హ్యాక్ చేసింది. మేం పేటీఎం మాల్‌ను య్యాక్ చేయలేదు.'' అని పేర్కొన్నారు. ఉదయం 03.15 సమయంలో ఈ ఖాతాను హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు.



    హ్యాకర్ల బారినపడిన narendramodi_in ట్విటర్ ఖాతా ప్రధాని మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్‌ సంబంధించినది. అంతేతప్ప అది ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా కాదు. వెబ్‌సైట్‌కు చెందినది మాత్రమే..! ఈ ఖాతాకు 25 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఐతే వెంటనే అప్రమత్తమైన ట్విటర్ ఇండియా టీమ్ హ్యాకర్లు చేసిన ట్వీట్లను తొలగించింది. ప్రస్తుతం ఆ ఖాతాను తమ ఆధీనంలోకి తీసుకుంది.

    కాగా, జులైలో పలువురు అంతర్జాతీయ ప్రముఖుల ట్విటర్ ఖాతాలు కూడా హ్యాకర్ల బారినపడిన విషయం తెలిసిందే. ట్విటర్ ఇంటర్నల్ సిస్టమ్‌లోకి చొరబడి ప్రముఖుల ట్విటర్ ఖాతాలను హ్యాక్ చేశారు. వారిలో అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బిజినెస్ టైకూకన్ ఎలన్ మస్క్ ఉన్నారు. అంతేకాదు ఉబెర్, యాపిల్ కంపెనీలకు చెందిన అధికారిక ఖాతాలు కూడా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోయాయి. వరుసగా ఇలాంటి ఘటనలు జరగుతుండడంతో దీనిపై సీరియస్‌గా దృష్టిపెట్టింది ట్విటర్ టెక్నికల్ టీమ్.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Narendra modi, Pm modi, Twitter

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు