మోదీ ప్రమాణ స్వీకారం వారణాసి నుంచేనా ?...పాత సాంప్రదాయాన్ని మోదీ బ్రేక్ చేస్తారా ?

ప్రధాని మోదీ (ఫైల్)

2014లో ప్రధానిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలోనే ప్రమాణస్వీకారం చేశారు. అంతేకాదు ప్రమాణస్వీకార మహోత్సవానికి సార్క్ దేశాల అధిపతులను ఆహ్వానించారు. అయితే ఈ సారి మాత్రం మోదీ ప్రమాణ స్వీకారం వారణాసి నుంచి చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

  • Share this:
    ఎన్డీఏ రెండో సారి గెలిస్తే ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ఎక్కడ నుంచి ఉండవచ్చు.. అనే చర్చ బీజేపీ వర్గాల్లో ప్రారంభమైంది. 2014లో ప్రధానిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలోనే ప్రమాణస్వీకారం చేశారు. అంతేకాదు ప్రమాణస్వీకార మహోత్సవానికి సార్క్ దేశాల అధిపతులను ఆహ్వానించారు. అయితే ఈ సారి మాత్రం మోదీ ప్రమాణ స్వీకారం వారణాసి నుంచి చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. మే 23న రానున్న ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ పూర్తి మెజారిటీతో అధికారం చేపడితే మాత్రం మోదీ వారణాసి నుంచి ప్రమాణ స్వీకారం చేయవచ్చని, దీనిపై న్యాయనిపుణుల సలహా తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే భద్రతా కారణాల రీత్యా రాష్ట్రపతి భవన్ అన్ని రకాలు సురక్షితమనే అభిప్రాయం కూడా వెలువడుతోంది. ముఖ్యంగా ప్రమాణ స్వీకారానికి త్రివిధ దళాధిపతులు, సుప్రీం కోర్టు జడ్జీలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విదేశీ రాయబారులు హాజరయ్యే అవకాశం ఉంది.

    అయితే నరేంద్ర మోదీ మదిలో వారణాసి గంగానదీ తీరంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రమాణస్వీకారం చేయాలనే ఆలోచన ఉందని బీజేపీలోని ఒక వర్గం వాదిస్తోంది. అంతే కాదు గతంలో హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ రాష్ట్ర రాజధాని కాకుండా, ఢిల్లీలోని హర్యానా భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉంటే వారణాసిలో ప్రమాణ స్వీకారానికి న్యాయపరమైన ఇబ్బందులు ఏమి ఉండవని, కేవలం సాంప్రదాయానికి భిన్నంగా జరగడం కిందకు వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే గతానికి భిన్నంగా నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో వ్యవహరించారని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. కాగా మే 23న ఎన్డీఏ ఎంత మెజారిటీ సాధిస్తుంది అనే దానిపైనే మోదీ ప్రమాణ స్వీకారం ఆధారపడిఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
    First published: