లోక్‌సభ ఎన్నికల్లో గెలుపెవరిది?...ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు

వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి దేశ ప్రధాని అవుతారని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు.

news18-telugu
Updated: March 29, 2019, 4:48 PM IST
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపెవరిది?...ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు
జేడీయు జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్
news18-telugu
Updated: March 29, 2019, 4:48 PM IST
వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, జేడీయు జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి అధికారంలోకి వస్తారని ఆయన జోస్యం చెప్పారు. ఎన్డీయేలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ పెద్ద నాయకుడే అయినా...బీజేపీకి పూర్తి మెజార్టీ రానిపక్షంలో నితీశ్ కుమార్ ప్రధాని పదవి రేసులో నిలుస్తారా? అన్న ప్రశ్నను లేవనెత్తడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎన్డీయేలో బీజేపీ, శివసేన తర్వాత మూడో అతిపెద్ద పార్టీ జేడీయూనే అని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.

శివసేన-బీజేపీ మధ్య సయోధ్య కుదిర్చేందుకే శివసేన అధినేత ఉద్దవ్ థాకరేతో గత వారం తాను భేటీ అయ్యానని జరుగుతున్న ప్రచారాన్ని ప్రశాంత్ కిషోర్ తోసిపుచ్చారు. ఉద్దవ్ థాకరే ఆహ్వానం మేరకే తాను ఆయన్ను కలిసినట్లు చెప్పారు. ఎన్నికల వ్యూహాల విషయంలో శివసేనకు తాను సహకరిస్తున్నట్లు మీడియాలో వెలువడిన కథనాలను కూడా ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుతం జేడీయు నేతగా ఉన్న తాను...మరో పార్టీకి రాజకీయ వ్యూహాలకు సంబంధించిన సలహాలు ఇవ్వలేనని వ్యాఖ్యానించారు.

First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...