నేడు సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్

9 రాష్ట్రాల్లో భాగంగా ఏపీ, తెలంగాణ సీఎంలతోనూ ప్రధాని మోదీ చర్చించనున్నారు.

news18-telugu
Updated: August 11, 2020, 3:16 AM IST
నేడు సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్
ప్రధాని నరేంద్ర మోదీ
  • Share this:
భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజుకు 60వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో  నేటి ఉదయం 9 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. పెరుగుతున్న కరోనా కేసులు ప్రభావం, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సహా పలు అంశాలపై చర్చించనున్నారు. 9 రాష్ట్రాల్లో భాగంగా ఏపీ, తెలంగాణ సీఎంలతోనూ ప్రధాని మోదీ చర్చించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, వైద్యశాఖ మంత్రి హర్షవర్దన్‌, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు.

కాగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 22లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశంలో 6లక్షల 34వేలకు పైగా కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 15లక్షల 34వేల మందికి పైగా బాధితులు ఈ మహమ్మారి నుంచి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 44వేలకు పైగా బాధితులు మరణించారు.
Published by: Shiva Kumar Addula
First published: August 11, 2020, 3:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading