ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరు ఎత్తకుండా ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. విశాఖలో నిర్వహించిన బీజేపీ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘ఇక్కడున్న నేతలు యూ టర్న్ తీసుకోవడంలో గొప్పోళ్లు. ఇప్పుడు తెలుగువారికి ద్రోహం చేసిన వారితో చేతులు కలిపారు. ఏపీకి వాళ్లు ఏం చేస్తారు? దేశానికి వారి ఎజెండా ఏంటో చెప్పలేదు. వారి లక్ష్యం మోదీని దించడమే.’ అని ప్రధాని మోదీ పరోక్షంగా చంద్రబాబు మీద విమర్శలు చేశారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కొందరు పగలూ రాత్రి బీజేపీపై అబద్ధాలు చెబుతున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. ప్రజల పిల్లలను ముందుకు తీసుకెళ్లాల్సిన వారు.. సొంత పిల్లలను ముందుకు తీసుకెళ్లడం మీద దృష్టిపెట్టారని ప్రధాని మోదీ పరోక్షంగా చంద్రబాబు మీద విమర్శలు చేశారు.
తమకు ఎలాంటి భయం లేదని మోదీ అన్నారు. పాపం చేసిన వాళ్లే భయపడతారన్నారు. రాష్ట్రంలో వారి కుటుంబ పాలనను ఏర్పాటు చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఫైళ్లు తెరుస్తారని కొందరు భయపడుతున్నారని మోదీ విమర్శించారు. దేశం మొత్తం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినదిస్తుంటే, మహాకూటమి నేతలు మాత్రం సైన్యం మనో ధైర్యం దెబ్బతినేలా మాట్లాడుతున్నాయని మోదీ మండిపడ్డారు. వారి మాటలను ఏకంగా పాకిస్థాన్ పార్లమెంట్‌లో కూడా ప్రస్తావించారన్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు.
ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల అయిన విశాఖ రైల్వేజోన్‌ను కేంద్ర ప్రభుత్వం సాకారం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేశామన్నారు. విశాఖలో జరిగిన బీజేపీ బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. విశాఖపట్నాన్ని స్మార్ట్ నగరంగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Chandrababu naidu, Mahakutami, Pm modi, Tdp