రేణిగుంటలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

రేణిగుంట విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలికేందుకు వచ్చిన వైసీపీ నేతలు అందరినీ.. పేరు పేరునా పరిచయం చేశారు వైఎస్ జగన్

news18-telugu
Updated: June 9, 2019, 5:40 PM IST
రేణిగుంటలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
రేణిగుంట విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన వైఎస్ జగన్ (Image:ANI)
news18-telugu
Updated: June 9, 2019, 5:40 PM IST
రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన నరేంద్ర మోదీకి రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేణిగుంట విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. కేంద్ర సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి కూడా వారితో పాటు మోదీకి స్వాగతం పలికారు. మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి మరికొందరు వైసీపీ, బీజేపీ నేతలు మోదీకి స్వాగతం పలికారు. అందరినీ మోదీకి పరిచయం చేశారు జగన్ మోహన్ రెడ్డి. నేతలు అందరూ బొకేలు కాకుండా ఓ రోజా పువ్వు ఇచ్చి మోదీకి స్వాగతం పలికారు.  రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక వాహనాల్లో మోదీ తిరుపతి సభకు వెళ్తున్నారు. అక్కడ ఏర్పాటుచేసిన ప్రజాధన్యవాద సభలో పాల్గొంటారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఘనవిజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఈ సభను ఏర్పాటు చేశారు. తిరుపతిలో బీజేపీ సభలో పాల్గొన్న తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల వెళ్తారు.

First published: June 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...