‘పీఎం నరేంద్ర మోదీ’ ఫస్ట్ లుక్ రిలీజ్..నమో పాత్రలో ఒదిగిపోయిన వివేక్ ఓబరాయ్

‘పీఎం నరేంద్రమోదీ’గా వివేక్ ఓబెరాయ్

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే కొన్ని విడుదలకు రెడీ గున్నాయి. మరొకొన్ని సెట్స్‌పై ఉన్నాయి. తాజాగా  ఈ సినిమాలో నరేంద్ర మోదీ క్యారెక్టర్‌లో వివేక్ ఓబెరాయ్ లుక్‌ను రిలీజ్ చేసారు ఈ చిత్ర యూనిట్. 

 • Share this:
  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే కొన్ని విడుదలకు రెడీ గున్నాయి. మరొకొన్ని సెట్స్‌పై ఉన్నాయి. ఇప్పటికే మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్రపై ఒక బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా.

  ఈ బయోపిక్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్ నటిస్తున్నాడు. తాజాగా  ఈ సినిమాలో నరేంద్ర మోదీ క్యారెక్టర్‌లో వివేక్ ఓబెరాయ్ లుక్‌ను రిలీజ్ చేసారు ఈ చిత్ర యూనిట్.  ‘పీఎం నరేంద్ర మోదీ’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రిలీజ్ చేశారు.

  ‘పీఎం నరేంద్రమోదీ’ తెలుగు, హిందీ పోస్టర్స్


  ‘దేశభక్తే నా శక్తి అనేది ట్యాగ్‌లైన్‌గా పెట్టారు. ఈ బయోపిక్‌ను దేశంలో 23 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు ఆయా భాషల్లో ఉన్న లుక్స్‌ను కూడా విడుదల చేశారు.

  ‘పీఎం నరేంద్రమోదీ’గా వివేక్ ఓబెరాయ్


  ప్రధాని మోదీగా..వివేక్ ఓబరాయ్ లుక్ అదిరిపోయింది. మాములుగా చూస్తే నరేంద్ర మోదీ అనుకునేలా వివేక్ ఓబరాయ్ ఆహార్యం ఉంది. కొంచెం స్పష్టంగా చూస్తే కానీ..వివేక్ ఓబరాయ్‌ అని గుర్తించడం కష్టం. అంతలా ప్రధాని మోదీ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడు.

  ‘పీఎం నరేంద్రమోదీ’గా వివేక్ ఓబెరాయ్


  ‘పీఎం నరేంద్రమోదీ’  సినిమాను ‘మేరీకోమ్’, ‘సరబ్‌జీత్’ వంటి బయోపిక్ సినిమాలను తెరకెక్కించిన ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. లెజెండ్ గ్లోబల్ స్టూడియో పతాకంపై  సందీప్ సింగ్, సురేష్ ఓబరాయ్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

  ‘పీఎం నరేంద్రమోదీ’గా వివేక్ ఓబెరాయ్


  ఒక మాములు దిగువ తరగతి కుటుంబంలో పుట్టి..రైల్వే స్టేషన్‌లో ‘టీ’ అమ్ముతూ బీజేపీలో అంచలంచెలుగా ఎదిగి ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా...ఆపై దేశ ప్రధాన మంత్రిగా ఎదిగిన వైనం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఒక కమర్షియల్ సినిమాకు కావాల్సినంత మసాలా ప్రధాని నరేంద్ర మోదీ జీవితంలో ఉంది.

  ‘పీఎం నరేంద్రమోదీ’ తెలుగు పోస్టర్


  పెద్ద నోట్లు రద్దు, జీఎస్‌టీ‌తో పాటు తాజాగా ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్స్ వంటి సంచలనాత్మక నిర్ణయాలతో దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ సినిమాను సార్వత్రిక ఎన్నికల ముందు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

  పీఎం నరేంద్ర మోదీ పాత్రలో నటిస్తోన్న వివేక్ ఓబరాయ్


  జనరల్ ఎలెక్షన్స్  ముందు ఈ సినిమాతో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై  పాజిటివ్ ఇంపాక్ట్  ఏర్పడేలా ఈ బయోపిక్‌ను  తెరకెక్కించే అవకాశాలున్నాయి. మొత్తానికి ఈ బయోపిక్ 2019 సార్వత్రిక ఎన్నికల ముందు విడుదలవుతుందా ? ఒకవేళ రిలీజైతే  అది భారతీయ జనతా పార్టీకి మేలు చేస్తుందా  లేదా అనేది చూడాలి.

  ఇవి కూడా చదవండి 

  యాత్ర ట్రైలర్ విడుదల..వైయస్‌ఆర్‌గా మమ్ముట్టి అదుర్స్

  మన్మోహన్ సింగ్‌కు ఊరట.. ఢిల్లీ హైకోర్టులో తొలిగిన అడ్డంకులు

  ‘ఎన్టీఆర్’ కోసం జోలె పట్టిన బాలకృష్ణ..
  First published: