Swachh Bharat : బీచ్‌లో చెత్త ఎత్తిన ప్రధాని మోదీ..

ఓ సాధారణ వ్యక్తిలో సముద్రం తీరంలో అరగంటపాటు తిరిగిన మోదీ... అక్కడున్న చెత్తను స్వయంగా ఆయనే శుభ్రం చేశారు.

news18-telugu
Updated: October 12, 2019, 10:55 AM IST
Swachh Bharat : బీచ్‌లో చెత్త ఎత్తిన ప్రధాని మోదీ..
బీచ్‌లో చెత్త ఎత్తిన ప్రధాని
news18-telugu
Updated: October 12, 2019, 10:55 AM IST
ప్రధాని మోదీ.. తన అద్భుతమైన ప్రసంగాలతోనే కాకుండా... ఆశ్యర్యానికి గురి చేసే పనులతో కూడా అందర్నీ ఆకట్టుకుంటారు. తాజాగా మోదీ చేసిన ఓ పనికి భారతదేశం అంతా షాక్ అయ్యింది.  దేశ ప్రధాని స్థాయిలో ఉన్నా కూడా ఆయన చూపిన నిరాడంబరతకు సెల్యూట్ చేసింది. ఇంతకీ మోదీ ఏం చేశారన్నదే కదా మీ డౌట్. ఓ సాధారణ వ్యక్తిలో సముద్రం తీరంలో అరగంటపాటు తిరిగిన మోదీ... అక్కడున్న చెత్తను స్వయంగా ఆయనే శుభ్రం చేశారు. బీచ్‌లో పడి ఉన్న ప్లాస్టిక్ కవర్లను, బాటిళ్లను ఆయన చెత్తో క్లీన్ చేశారు. తమిళనాడులో పర్యటిస్తున్న మోదీ ఇవళ ఉదయం మామల్లపురం బీచ్‌ను సందర్శించారు.

అక్కడ అరగంటపాటు సంచరించి... బీచ్‌లో పడి ఉన్న చెత్తను స్వయంగా ఆయన చేతులతోనే శుభ్రం చేశారు. అరగంటపాటు పర్యటించి అక్కడున్న చెత్తను క్లీన్ చేసినట్లు ఆయన స్వయగా తన ట్విట్టర్ ఖాతోలో పోస్టు చేశారు. అక్కడ సేకరించిన చెత్తను హోటల్ సిబ్బందిలో భాగమైన జయరాజ్‌కు అప్పగించినట్లుగా తెలిపారు.  మన బహిరంగ ప్రదేశాలు శుభ్రంగా మరియు చక్కగా ఉండేలా చూద్దాం. మనం ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందాం. అంటూ ట్వీట్ చేశారు మోదీ. మోదీ ట్వీట్‌కు లక్షల్లో లైకులు వస్తున్నాయి. మీరు గ్రేట్ సార్ అంటూ.. నెటిజన్లు ఆయనను ప్రశంసంలతో ముంచెత్తుతున్నారు.




First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...