ప్రధాని మోదీకి ఐదేళ్లలో రూ.72లక్షల ఆదాయం.. ఆస్తులు, అప్పులు ఇవే..

వారణాసిలో ప్రధాని మోదీ సహా మొత్తం 119 మంది నామినేషన్లు దాఖలు అయ్యాయి. (PTI)

అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం నరేంద్ర మోదీ వద్ద రూ.1,41,36,119 విలువైన చరాస్తులు ఉన్నాయి. అందులో నగదు, బంగారం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఎల్‌ఐసీలు ఉన్నాయి.

 • Share this:
  ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా మోదీ సమర్పించిన అఫిడవిట్‌లో ప్రధాని తన ఆస్తులు, అప్పులను వివరించారు. అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం నరేంద్ర మోదీ వద్ద రూ.1,41,36,119 విలువైన చరాస్తులు ఉన్నాయి. అందులో నగదు, బంగారం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఎల్‌ఐసీలు ఉన్నాయి. మోదీ తన భార్య జశోదా బెన్‌ పేరును అఫిడవిట్‌లో పొందుపరిచినా, ఆమె పాన్ కార్డు, ఆస్తులు, అప్పులు వివరాలు తెలియవని రాశారు. మోదీకి ఎలాంటి ఎలాంటి వాహనాలు లేవు. అయితే, మోదీ పేరు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 3531.45 చదరపు అడుగుల స్థలం ఉంది. దాని మార్కెట్ విలువ రూ.1,10,00,000గా పేర్కొన్నారు. ఎలాంటి అప్పులు లేవని అఫిడవిట్‌లో తెలిపారు. తాను మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చదివినట్టు మోదీ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 1967లో ఎస్‌ఎస్‌సీ, 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, 1983లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసినట్టు తెలిపారు.

  నరేంద్ర మోదీ అఫిడవిట్‌లో పొందుపరిచిన ఆస్తుల వివరాలు


  నరేంద్ర మోదీ చరాస్తులు మొత్తం - రూ.1,41,36,119
  1.నగదు రూ. 38,750
  2.ఎస్‌బీఐ ఎఫ్‌డీఆర్ రూ.1,27,81,574
  3.ఎల్ అండ్ టీ బాండ్ రూ.20,000
  4.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో రూ.7,61,466
  5.నాలుగు బంగారపు ఉంగరాలు రూ.1,13,800

  తన విద్యార్హతలపై ప్రధాని నరేంద్రమోదీ డిక్లరేషన్


  ఐదేళ్లలో నరేంద్ర మోదీ రూ.72,03,921 ఆదాయం వచ్చినట్టు చూపారు.
  2013 - 14 సంవత్సరంలో రూ.9,69,711
  2014 - 15 సంవత్సరంలో రూ.8,58,780
  2015 - 16 సంవత్సరంలో రూ.19,23,160
  2016 - 17 సంవత్సరంలో రూ.14,59,750
  2017 - 18 సంవత్సరంలో రూ.19,92,520

  మోదీ ఆస్తులు, అప్పుల వివరాలు

  First published: