Home /News /politics /

Amit Shah: భారత జాతి గౌరవాన్ని నిలిపిన ఘనత మోదీదే. హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు

Amit Shah: భారత జాతి గౌరవాన్ని నిలిపిన ఘనత మోదీదే. హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు

అమిత్​ షా

అమిత్​ షా

Amit Shah: గతంలో పేదల ప్రజలను ఎవరూ పట్టించుకోలేదని.. కానీ తమ హయాంలో 80 కోట్ల మందిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేసినట్లు చెప్పారు. నగదు బదిలీ పథకం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుదీకరణ, పేదరిక నిర్మూలన ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు అమిత్ షా.

ఇంకా చదవండి ...
    నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గత ఏడేళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. ఆదివారం ఆయన హిందూస్థాన్ టైమ్స్ లీడర్ సమ్మిట్‌లో పాల్గొని ప్రసంగించారు. ఈమోదీ హయాంలో తీసుకొచ్చిన మార్పులు, చేసిన అభివృద్ధి గురించి ఈ సందర్భంగా వివరించారు. సర్జికల్ స్ట్రైక్స్ (Surgical Strikes), జమ్మూకాశ్మీర్‌ (Jammu nd Kashmir)లో ఆర్టికల్ 370 రద్దు (Article 377 abolition) ఇలా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు అమిత్ షా. కరోనా మనందరి జీవితాలను మార్చేసిందని అన్నారు. ఒకప్పుడు ప్రపంచ యుద్ధానికి ముందు, తర్వాత అని చెప్పుకునేవారని, కానీ ఇప్పుడు కరోనాకు ముందు.. కరోనాకు తర్వాత అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి వల్ల రాజకీయాల్లోనే కాదు ఎన్నో అంశాల్లో మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. మరి ఆ మార్పులకు మన సంసిద్దంగా ఉన్నామా? లేదా? అనేది తేల్చుకోవాలని చెప్పారు అమిత్ షా.

    Delhi Pollution: పాకిస్తాన్ వల్లే ఢిల్లీలో కాలుష్యం..సుప్రీంకోర్టులో వాదనలు..సీజేఐ

    2014 నుంచి భారత ప్రజలలు ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని చూస్తున్నారని అమిత్ షా పేర్కొన్నారు. 2014 ముందు పాలిసీ పెరాలిసిస్ స్థితిలో మనదేశం ఉండేదని ఆయన అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో భారత ప్రతిష్ఠ దెబ్బతిందని విమర్శించారు. ప్రతి మంత్రీ తాను ప్రధానిలా ఫీలయ్యే వారని అన్నారు. కానీ మోదీ నేతృత్వంలో భారత దేశం తిరిగి తన ఖ్యాతిని తాను సంపాదించుకుందని చెప్పుకొచ్చారు అమిత్ షా. నరేంద్ర ఎంతో సహనం, ప్రణాళికతో ఎన్నో సున్నితమైన సమస్యలను కూడా పరిష్కరించారని ప్రశంసించారు.

    pm modi on konijeti rosaiah : రాజకీయ విరోధులైనా రోశయ్యతో మోదీ బంధం ఎలా కుదిరిందంటే..

    గతంలో పేదల ప్రజలను ఎవరూ పట్టించుకోలేదని.. కానీ తమ హయాంలో  80 కోట్ల మందిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేసినట్లు చెప్పారు. నగదు బదిలీ పథకం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుదీకరణ, పేదరిక నిర్మూలన ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు అమిత్ షా. అంతేకాదు ఆర్థిక రంగంలో ఒడిదుడుకులను కూడా ఎంతో క్రమశిక్షణతో పరిష్కరించినట్లు చెప్పుకొచ్చారు. బ్యాంకలకు నిరర్థక ఆస్తుల భారాన్ని తగ్గించామని తెలిపారు.

    ఫిన్‌టెక్ కార్యక్రమాలను విప్లవంగా మార్చే సమయం ఆసన్నమైంది: ప్రధాని మోదీ

    విదేశీ విధానానికి అనుగుణంగానే రక్షణ విధానాన్ని కూడా మార్చామని అమిత్ షా చెప్పుకొచ్చారు. సరిహద్దుల్లో రెచ్చగొట్టే వారికి కూడా సర్జికల్ స్ట్రైక్స్ వంటి చర్యలతో బుద్ధి చెప్పామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాల వల్లే విదేశీ మారకం విలువ 473 బిలియన్ల నుంచి 640 బిలియన్లకు చేరిందని చెప్పారు అమిత్ షా.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Amit Shah, Bjp, Narendra modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు