news18-telugu
Updated: January 4, 2019, 12:49 PM IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(ఫైల్ ఫోటో)
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే కొన్ని విడుదలకు రెడీ గున్నాయి. మరొకొన్ని సెట్స్‌పై ఉన్నాయి. ఇప్పటికే మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్ త్వరలో విడుదల కానుంది. ఇంకోవైపు దివంగత సీఎం వైయస్.రాజశేఖర్ రెడ్డి పాద యాత్ర నేపథ్యంలో ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతోంది.
దాంతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానిగా దారి తీసిన పరిస్థితులపై ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమాపై వివాదాలు ముసురుకున్నాయి.

‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’
మరోవైపు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితంపై ఒకే సారి మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి.

జయలలిత పాత్రలో నిత్యామీనన్
తాజాగా జాబితాలో మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బయోపిక్ త్వరలో పట్టాలెక్కనుంది. మాములు దిగువ తరగతి కుటుంబంలో పుట్టి..రైల్వే స్టేషన్లో ‘టీ’ అమ్ముతూ బీజేపీలో అంచలంచెలుగా ఎదిగి ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా...ఆపై దేశ ప్రధాన మంత్రిగా ఎదిగిన వైనం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఒక కమర్షియల్ సినిమాకు కావాల్సినంత మసాలా ప్రధాని నరేంద్ర మోదీ జీవితంలో ఉంది.

ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో)
‘మేరీకోమ్’ ఫేమ్ ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
ఈ సినిమాలో భారత ప్రధాన మంత్రి పాత్రలో వివేక్ ఓబెరాయ్ నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఈ చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించనుంది.

పీఎం మోదీ, వివేక్ ఓబరాయ్ (ఫైల్ ఫోటో)
అంతేకాదు ఈ నెల 7న ప్రధాని పాత్రలో వివేక్ ఓబరాయ్ సంబంధించిన లుక్‌ను విడుదల చేయనున్నారు. మొత్తానికి పెద్ద నోట్లు రద్దు, జీఎస్టీ వంటి సంచలనాత్మక నిర్ణయాలతో దేశ రాజకీయాలను ప్రభావితం చేసారు మోదీ. ఈ సినిమాను సార్వత్రిక ఎన్నికల ముందు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. జనరల్ ఎలెక్షన్స్ ముందు ఈ సినిమాతో మోదీపై కేంద్ర ప్రభుత్వంపై పాజిటివ్ ఇంపాక్ట్ ఏర్పడేలా ఈ సినిమాను తెరకెక్కించే అవకాశాలున్నాయి. మొత్తానికి 2019 సార్వత్రిక ఎన్నికల ముందు విడుదలవుతుందా ? ఒకవేళ రిలీజైతే ఒకవేళ అది భారతీయ జనతా పార్టీకి మేలు చేస్తుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఇవి కూడా చదవండి
కోర్డు కెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’...అనుపమ్ ఖేర్‌పై కేసు
చంద్రబాబుకు దావోస్ దెబ్బ కొట్టిన కేంద్రం...ఏం చేసిందంటే..
First published:
January 4, 2019, 11:25 AM IST