పార్లమెంట్‌కు రాని బీజేపీ ఎంపీలపై ప్రధాని మోదీ ఆగ్రహం

ప్రధాని నరేంద్ర మోదీ (File)

PM Narendra Modi | పార్లమెంట్‌ సమావేశాల్లో రోస్టర్‌ డ్యూటీకి అనుగుణంగా వ్యవహరించట్లేదని, మంత్రులు సమావేశాలకు సరిగా హాజరుకావడం లేదని ప్రధాని మోదీ మండిపడ్డారు.

  • Share this:
    ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాని బీజేపీ ఎంపీలు, మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంట్ లైబ్రరీ హాల్‌లో జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఈ అంశంపై సీరియస్‌గా స్పందించారు. పలువురు కేంద్ర మంత్రులపై కూడా ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ సమావేశాల్లో రోస్టర్‌ డ్యూటీకి అనుగుణంగా వ్యవహరించట్లేదని, మంత్రులు సమావేశాలకు సరిగా హాజరుకావడం లేదని మోదీ మండిపడ్డారు. ఆయాశాఖలపై పట్టు సాధించడం లేదని ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు. సమావేశాలకు సరిగా హాజరుకాని మంత్రుల జాబితాను రెడీ చేయాలన్నారు.

    రోస్టర్‌ డ్యూటీ సరిగా అమలు చేయని మంత్రుల జాబితా సిద్ధం చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌జోషిని ప్రధాని మోదీ ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీలకు మోదీ పాలనపరంగా దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల్లో ఎంపీలు రాజకీయాలకు అతీతంగా పనులు చేయాలన్నారు. యుద్ధప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రధాని మోదీ సూచించారు. కొద్దిరోజుల క్రితం పార్లమెంట్‌కు కచ్చితంగా రావాలని ఎంపీలు, మంత్రులకు సూచించిన ప్రధాని మోదీ... కొద్దివారాల వ్యవధిలోనే ఈ అంశంపై సీరియస్‌గా స్పందించడం చర్చనీయాంశంగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published: