బద్రీనాథ్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ఆదివారం కూడా కొనసాగింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాని మోదీ ఆధ్యాత్మిక బాటపట్టారు. తాజాగా బద్రీనాథ్ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. నారాయణుడికి పూజలు చేశారు. బద్రీనాథ్ ఆలయ పరిసరాల్లో ఉన్న భక్తుల్ని మోదీ అభివాదం చేశారు. ఈ సందర్భంగా బద్రీనాథ్‌లో ఆలయ అధికారులు ... పూజారులు మోదీకి ఘన స్వాగతం పలికారు. శనివారం మోదీ కేదార్‌నాథ్‌లో పర్యటించారు. కేదారీశ్వరుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనుల్ని ప్రధాని పర్యవేక్షించారు.
అయితే కేదార్‌నాథ్ పర్యటనలో మోదీ ధరించిన వస్త్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. పొడవాటి జుబ్బాతో పాటు... ఓ రకమైన టోపిని ధరించారు. నడుముకు ఎర్రటి బట్ట కట్టుకున్నారు. ఎడమవైపు భుజంపై వైపు శాలువా కూడా వేసుకున్నారు. దీంతో ఆయన వేసుకున్న ప్రత్యేక వస్త్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రధాని మొదటి నుంచి హిందుత్వ వాదిగా కనిపిస్తూనే ఉన్నారు. ప్రకృతి విలయం సంభవించినప్పటి కూడా మోదీ కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం అక్కడున్న గుహల్లో ఆయన ధ్యానం కూడా చేశారు. మొత్తం మీద ఆధ్యాత్మకి పర్యటన పేరుతో మోదీ మరోసారి ప్రజల్ని ఆకర్షించే పనిలో పడ్డారు.
Prime Minister Narendra Modi after offering prayers at Badrinath Temple in Uttarakhand. pic.twitter.com/DO74PCfW2D
— ANI (@ANI) May 19, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kedarnath, Narendra modi, National News, Pm modi