PM NARENDRA MODI ADDRESSES NATION ON AUGUST 7TH ON OVER BIFURCATE JAMMU AND KASHMIR SB
ఎల్లుండి జాతినుద్దేశించి ప్రధాని మోదీ కీలక ప్రసంగం
ప్రధాని నరేంద్ర మోదీ
బుధవారం నాడు అఖిలపక్ష భేటీకి కూడా ప్రధాని కార్యాలయం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో 7వ తేదీ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారోన్న ఉత్కంఠ నెలకొంది.
దేశ ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలను కట్టబట్టే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ, రాష్ట్రపతి సంతకం పెట్టిన వేళ, ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. 7వ తేదీ, అంటే బుధవారం నాడు జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో ఆర్టికల్ రద్దుకు దారితీసిన పూర్వపరాలను, ప్రభుత్వం తీసుకోనున్న తదుపరి నిర్ణయాలపై ఆయన వెల్లడిస్తారని సమాచారం. ఇదే సమయంలో బుధవారం నాడు అఖిలపక్ష భేటీకి కూడా ప్రధాని కార్యాలయం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో 7వ తేదీ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారోన్న ఉత్కంఠ నెలకొంది.
సోమవారం ఉదయం రాజ్యసభలో అమిత్ షా కాశ్మీర్‌పై కీలక ప్రకటన చేశారు. ఆర్టికల్ 370రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజనపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు షా ప్రసంగాన్ని అడ్డుకున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాంనబీ ఆజాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పి, సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు.