ఇమ్రాన్‌ఖాన్‌కు మోదీ లేఖపై దుమారం

పాక్ కొత్త ప్రధానికి అభినందనలతో పాటు.. ఇరు దేశాల మధ్య చర్చల ప్రస్తావన చేస్తూ మోదీ లేఖ రాసినట్టు ఆ దేశ విదేశాంగవర్గాలు ప్రచారం చేశాయి. వాటిని భారత ప్రభుత్వం ఖండించింది.

news18-telugu
Updated: September 20, 2018, 4:18 PM IST
ఇమ్రాన్‌ఖాన్‌కు మోదీ లేఖపై దుమారం
ఇమ్రాన్ ఖాన్, మోదీ(File)
  • Share this:
పాకిస్థాన్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. దీంతో పాక్‌తో చర్చకు భారత్ సిద్ధంగా ఉందనే సంకేతం పంపినట్టు పాకిస్థాన్‌ విదేశీ వ్యవహారాల శాఖ ప్రచారం చేసింది. దీనిపై వివాదం చెలరేగింది. ఓ వైపు భారత సైనికుల మీద తుపాకులు ఎక్కుపెడుతున్న దాయాదితో చర్చకు చేయి చాచడంపై విమర్శలు వచ్చాయి. దీంతో భారత ప్రభుత్వ వర్గాలు లేఖపై క్లారిటీ ఇచ్చాయి.

మా విదేశాంగ విధానాన్ని సమీక్షిస్తాం. ఉపఖండంలో శాంతి, సుస్థిరత నెలకొనాలన్నదే మా ఆకాంక్ష. భారత్‌తో మేం చర్చలు కోరుకుంటున్నాం. రెండు దేశాలకు న్యూక్లియర్ పవర్ ఉందన్న విషయాన్ని గుర్తించాలి. మా మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలు చాలా ఉన్నాయి. అందులో కాశ్మీర్ కూడా ఒకటి. భారత విదేశాంగ శాఖ నుంచి ఓ లేఖ అందింది. ఇమ్రాన్ ఖాన్‌ను అభినందించడంతోపాటు.. చర్చలు కోరుకుంటున్నట్టు ఆ లేఖలో భారత్ తెలిపింది.

షా మహమూద్ ఖురేషీ, పాక్ విదేశాంగ మంత్రి


ఇమ్రాన్‌ఖాన్‌కు ప్రధాని మోదీ లేఖ రాశారని ప్రభుత్వ వర్గాలు అంగీకరించాయి. అయితే, ఆ లేఖలో కేవలం పాక్ కొత్త ప్రధానికి అభినందనల ప్రస్తావన మాత్రమే ఉందని, ఎలాంటి చర్చల అంశం ఆ లెటర్‌లో లేదని అధికారవర్గాలు న్యూస్18కి తెలిపాయి. ఓ వైపు టెర్రర్, మరోవైపు చర్చలు ఒకేసారి కొనసాగలేవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

పాకిస్థాన్ 22వ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం (File)


పాకిస్థాన్ 22వ ప్రధానిగా ఎన్నికైన ఇమ్రాన్ ఖాన్, ఇరుగుపొరుగు దేశాలతో స్నేహసంబంధాలు పెంపొందించుకుంటామని చెప్పారు. సరిహద్దుల్లో శాంతి లేకపోతే, దేశంలో శాంతి నెలకొనడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో భారత ప్రధాని నుంచి చర్చల ప్రస్తావన వచ్చిందంటూ పాక్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రచారం చేయడంతో దుమారం రేగింది.

పాక్ ఎన్నికల్లో పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అత్యధిక స్థానాలు దక్కించుకున్నప్పుడు.. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో భారత ప్రధాని మోదీని కూడా ఆహ్వానిస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే, ఆ తర్వాత ఆ ప్రతిపాదనను పీటీఐ ఉపసంహరించుకుంది. కొందరు క్రీడా మిత్రులకు మాత్రమే ఆహ్వానాలు అందాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 20, 2018, 12:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading