‘ఆయురారోగ్యాలతో చిరకాలం ఉండండి’ చంద్రబాబుకు మోదీ శుభాకాంక్షలు

ఆయురారోగ్యాలతో చిరకాలం ఉండాలని కోరుకుంటున్నానంటూ ప్రధాని ట్వీట్ చేశారు. అంతకుముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుకు విషెస్ తెలిపారు.

news18-telugu
Updated: April 20, 2019, 10:13 AM IST
‘ఆయురారోగ్యాలతో చిరకాలం ఉండండి’ చంద్రబాబుకు మోదీ శుభాకాంక్షలు
చంద్రబాబు, నరేంద్ర మోదీ
news18-telugu
Updated: April 20, 2019, 10:13 AM IST
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు 69వ పుట్టిన రోజును టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్దఎత్తున జరుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోవీ కూడా ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో చిరకాలం ఉండాలని కోరుకుంటున్నానంటూ ప్రధాని ట్వీట్ చేశారు. అంతకుముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుకు విషెస్ తెలిపారు. ట్విట్టర్లో చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు జగన్. బర్త్‌డే రోజున కూడా చంద్రబాబు పార్టీ వ్యవహారాలతోనే బిజీ బిజీగా ఉన్నారు. ఇవాళళ ఆయన హైదారాబాద్‌లో కూడా పర్యటించున్నారు.

ఉండవల్లిలోని తన నివాసంలో అభిమానులు, పార్టీ నేతలతో గడుపుతారు చంద్రబాబు. వారి సమక్షంలోనే కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకునే అవకాశం ఉంది. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్‌లో జరిగే ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు.చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 20, 1950లో చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో జన్మించారు. అమ్మణమ్మ-ఖర్జూర నాయుడు ఆయన తల్లిదండ్రులు. 1972లో బీ.ఏ పూర్తి చేసిన ఆయన.. శ్రీ వెంకటేశ్వర యూనిర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో పీజీ పూర్తి చేశారు. 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...