వాజ్‌పేయి జయంతి.. లక్నోలో విగ్రహం ఆవిష్కరించనున్న మోదీ

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నేడు వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయనున్నారు.

news18-telugu
Updated: December 25, 2019, 9:22 AM IST
వాజ్‌పేయి జయంతి.. లక్నోలో విగ్రహం ఆవిష్కరించనున్న మోదీ
ప్రధాని మోదీ
  • Share this:
దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 95వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో జయంతి శుభాకాంక్షలు తెలిపారు. వాజ్‌పేయి జయంతి సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నేడు వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయనున్నారు. అంతకంటే ముందు ఢిల్లీలో 11గంటలకు 'అటల్ భుజల్ యోజన' పథకాన్ని ప్రారంభించనున్నారు.

కాగా, భూగర్భ జలాల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 'అటల్ భుజల్ యోజన' పథకం తీసుకొస్తోంది. ఈ పథకాన్ని రూ.8350కోట్లతో కర్ణాటక,మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అమలుచేయనున్నారు. ఈ పథకంలో భాగంగా నీటి వినియోగదారుల సంఘాల ఏర్పాటు, భూగర్భజల డేటాను పర్యవేక్షణ, నీటి బడ్జెట్, గ్రామ పంచాయతీల వారీగా నీటి భద్రతా ప్రణాళికల రూపకల్పన, స్థిరమైన భూగర్భ జల నిర్వహణకు సంబంధించిన సమాచారం, విద్య మరియు కమ్యూనికేషన్ (ఐఇసి) కార్యకలాపాలను నిర్వహించనున్నారు.First published: December 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు