హోమ్ /వార్తలు /politics /

You Retire: ప్రతిపక్ష బెంచీల వద్దకు PM Modi..ఎంపీలకు విషెస్.. ఆ ఒక్కమాటతో అంతా షాక్!

You Retire: ప్రతిపక్ష బెంచీల వద్దకు PM Modi..ఎంపీలకు విషెస్.. ఆ ఒక్కమాటతో అంతా షాక్!

ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగం ముగిశాక లోక్‌సభ వాయిదా పడిన తర్వాత కూడా ప్రధాని మోదీ కాసేపు లోపలే గడిపి, ఎదురుగా ఉన్న విపక్షాల బెంచీల వద్దకు వెళ్లారు. అప్పుడొక అనూహ్య సంవాదం చోటుచేసుకుంది..

ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగం ముగిశాక లోక్‌సభ వాయిదా పడిన తర్వాత కూడా ప్రధాని మోదీ కాసేపు లోపలే గడిపి, ఎదురుగా ఉన్న విపక్షాల బెంచీల వద్దకు వెళ్లారు. అప్పుడొక అనూహ్య సంవాదం చోటుచేసుకుంది..

ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగం ముగిశాక లోక్‌సభ వాయిదా పడిన తర్వాత కూడా ప్రధాని మోదీ కాసేపు లోపలే గడిపి, ఎదురుగా ఉన్న విపక్షాల బెంచీల వద్దకు వెళ్లారు. అప్పుడొక అనూహ్య సంవాదం చోటుచేసుకుంది..

    ఎన్నికల ప్రచారాలు, సాధారణ బహిరంగ సభల్లోనే కాదు చాలా సార్లు చట్టసభల్లోనూ తనదైన వాగ్ధాటితో విపక్షాలను చీల్చిచెండాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పార్లమెంట్ లోపల విధానపరమైన చర్చల్లో గంభీరంగా ఉండే ఆయన.. లీజర్ టైమ్‌లో మాత్రం ప్రతిపక్షాలనూ స్నేహపూర్వకంగా పలకరించడం మర్చిపోరు. అలాంటి దృశ్యమే మంగళవారం కూడా చోటుచేసుకుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం ముగిశాక లోక్‌సభ వాయిదా పడిన తర్వాత కూడా ప్రధాని మోదీ కాసేపు లోపలే ఉండిపోయారు. అధికార పక్ష ఎంపీలు ఒక్కొక్కరుగా లేని బయటికి వెళుతుంటే, ప్రధాని మోదీ మాత్రం ఎదురుగా ఉన్న విపక్షాల బెంచీల వద్దకు వెళ్లారు. అప్పుడొక అనూహ్య సంవాదం చోటుచేసుకుంది..

    నిర్మల బడ్జెట్ ప్రవేశపెడుతున్నంత సేపూ బల్ల చరుస్తూ ప్రోత్సహించిన ప్రధాని మోదీ.. ప్రసంగం ముగిసిన తర్వాత ఆర్థిక మంత్రి దగ్గరికెళ్లి అభినందించారు. ఆ వెంటనే విపక్షాల బెంచీల వైపునకు కదిలారు. అప్పటికే కాంగ్రెస్ ఎంపీలు చాలా మంది బయటికెళ్లిపోయారు. మోదీ తమ వైపు రావడాన్ని చూసి టీఎంసీ, టీఆర్ఎస్, వైసీపీ ఎంపీలు లేచి నిలబడి ప్రధానికి నమస్కరిస్తూ తమ సీట్ల నుంచి బయటకు వచ్చి సభ మధ్యలో నిలబడ్డారు. ఎంపీలను పేరుపేరునా పలకరిస్తూ కుశలప్రశ్నలు వేశారు మోదీ.

    Mystery: అనంతపురం అమ్మాయిలు.. కడపలో ఘోరం.. వాళ్లు ప్రాణస్నేహితులని పేరెంట్స్‌కు తెలీదు!

    ఆ సమయంలో సభలోనే ఉన్న కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా, టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ లను పలకరిస్తూ ‘ఆప్ కా తబియత్ ఠీక్ హై?(మీ ఆరోగ్యం బాగుందా?)’అని వాకబు చేశారు ప్రధాని మోదీ. డీఎంకే ఎంపీ రాజా, మరికొందరితోనూ మోదీ కరచాలనం చేశారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో ప్రధాని మోదీ, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ మధ్య అనూహ్య సంవాదం చోటుచేసుకుందప్పుడు..

    OMG: వామ్మో, ఇదేందయ్యా! అతనికి 8మంది భార్యలు.. ఒకే ఇంట్లో కాపురం.. వంతులవారీగా ఆ పని..

    విపక్షాల బెంచీలను ఒక్కొక్కటిగా దాటుకుంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలైన సుదీప్ బందోపాధ్యాయ, సౌగతా రాయ్‌ల వద్దకు మోడీ వెళ్లారు. "తబియత్ ఠీక్ హే?" అని ప్రధాని ప్రశ్నించగా, రాయ్ ముకుళిత హస్తాలతో నమస్కరించారు. భుజం తట్టి ముందుకు వెళ్లబోయిన మోదీకి రాయ్ నుంచి అనూహ్య అభ్యర్థన వచ్చింది.

    Pre-Polls Survey Results: యూపీలో బీజేపీ ఓటమి.. అఖిలేశ్ సీఎం: ఎవరికెన్ని సీట్లంటే..

    పశ్చిమ బెంగాల్లో గవర్నర్ జగదీప్ దినకర్ తీరుపై టీఎంసీ సీఎం మమతా బెనర్జీ అసాధారణ యుద్ధం చేస్తున్న దరిమిలా, ఆ పార్టీ ఎంపీ రాయ్.. బెంగాల్ గవర్నర్‌ను పదవి నుంచి ఎప్పుడు తొలగిస్తారని ప్రధానిని అభ్యర్థించారు. అందుకు మోదీ.. ‘ముందు మీరు(రాయ్) పదవీ విరమణ (You Retire) చేస్తే ఆ తర్వాత దాని(గవర్నర్ తొలగింపు) గురించి ఆలోచిస్తాలే..’అని నవ్వుతూ బదులిచ్చారు. ఆ మాటతో టీఎంసీ ఎంపీలకు షాక్ తగిలినంతపనైంది. ఆ తర్వాత మోదీ, ఆయన వెనుక విపక్ష ఎంపీలు సభ నుంచి వెళ్లిపోయారు.

    First published:

    ఉత్తమ కథలు