యూఏఈలో పర్యటించనున్న మోదీ.. అత్యున్నత గౌరవం అందుకోనున్న ప్రధాని

యూఏఈ పర్యటనకు మోదీ

ఆగస్టు 23 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్‌లలో మూడు రోజుల పాటు మోదీ పర్యటన కొనసాగనుంది.

  • Share this:
    ప్రధాని మోదీ భూటాన్ పర్యటన ముగియగానే.. మరో విదేశీ పర్యటనకు ముహుర్తం ఖరారైంది ఆగష్టు 23 నుంచి నరేంద్ర మోదీ మూడు రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటించనున్నారు. అక్కడ ఆ దేశ అత్యున్నత పౌర గౌరవాన్ని మోదీ స్వీకరించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యాలయం పేర్కొంది. ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలకు ప్రోత్సాహాన్ని ఇవ్వడంలో "కీలక పాత్ర" పోషించినందుకు మోదీకి ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేస్తున్నట్లు యుఎఇ ఏప్రిల్‌లో ప్రకటించింది. యుఎఇ వ్యవస్థాపకుడు అయిన షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ పేరిట ఈ అవార్డు ఏర్పాటు చేశారు. గల్ఫ్ దేశ నాయకుడి  వందేళ్ల జయంతి ఉత్సవాల్లో భాగంగా మోదీకి  ఈ అవార్డు అందివ్వడం ఇప్పుడు ప్రాముఖ్యతను సంతరించుకుంది.

    ఆగస్టు 23 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్‌లలో మూడు రోజుల పాటు మోదీ పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా ఇరు దేశాలు పరస్పర ఆసక్తి ఉన్న ద్వైపాక్షిక, ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై విస్తృతమైన చర్చలు జరపనున్నారు. పర్యటనలో భాగంగా మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో భేటీ కానున్నారు. పరస్పర ఆసక్తి ఉన్న ద్వైపాక్షిక, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ విషయాలపై ఇరువు చర్చించనున్నట్లు సమాచారం.

    భారత్‌, యూఏఈ మధ్య గత కొన్నేళ్లుగా సంబంధాలు మెరుగుపడ్డాయి. బ్రహెయిన్‌లో కూడా మోదీ కింగ్ షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ ఖలీఫాతో కూడా భేటీ అయి పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ కింగ్ ఖలీఫా మోదీకోసం ఓ ప్రత్యేక విందును కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో మనామాలో మోదీ కృష్ణుడి ఆలయాన్ని కూడా ప్రారంభించనున్నారు.
    First published: