జీ7 సదస్సుకు మోదీ... ఇవాళ ట్రంప్‌తో ప్రధాని భేటీ

జీ7లో బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, అమెరికా ఉన్నాయి. ఈ గ్రూపు నుంచి 2014లో రష్యాను బహిష్కరించడంతో జీ8 కాస్త జీ7గా మారింది.

news18-telugu
Updated: August 26, 2019, 8:12 AM IST
జీ7 సదస్సుకు మోదీ... ఇవాళ ట్రంప్‌తో ప్రధాని భేటీ
ప్రధాని మోదీ, ట్రంప్
  • Share this:
ఫ్రాన్స్‌లో జరగనున్న జి-7 సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ కానున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.45 గంటలకు మోడీ, ట్రంప్‌ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇరువురు నేతల మధ్య 40 నిమిషాలపాటు చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత ఉపఖండ పరిస్థితులపై మోడీ, ట్రంప్‌ చర్చిస్తారని సమాచారం. 370 అధికరణం రద్దు తర్వాత నెలకొన్న పరిస్థితులపై చర్చ జరిగే అవకాశం ఉంది. సీమాంతర ఉగ్రవాదం ప్రోత్సహిస్తున్న పాక్‌ వైఖరిపై చర్చ జరిగే సూచనలు కూడా ఉన్నాయి. వీటితో పాటు.. వాణిజ్య నిబంధనలు, ఇతర అంశాలపై మోడీ, ట్రంప్‌ మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. 
ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్‌ మెక్రాన్‌ వ్యక్తిగత ఆహ్వానంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ జీ7 సదస్సులో ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొంటున్నారు. ఆదివారం రాత్రి ఆయన.. జీ7 సదస్సు జరుగుతున్న బియరిజ్‌(ఫ్రాన్స్‌)కు చేరుకున్నారు. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో భేటీ అయ్యారు. జీ7 సదస్సులో పర్యావరణం, డిజిటల్‌ రూపాంతరీకరణ అంశాలపై మోదీ ప్రసంగించనున్నారు. ఇక్కడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో వేర్వేరుగా భేటీ కానున్నారు.  జీ7లో బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, అమెరికా ఉన్నాయి. ఈ గ్రూపు నుంచి 2014లో రష్యాను బహిష్కరించడంతో జీ8 కాస్త జీ7గా మారింది. రష్యాను తిరిగి తమతో కలుపుకోవడానికి జీ7 దేశాల నేతలు మొగ్గు చూపుతున్నట్టు దౌత్య వర్గాలు తెలిపాయి.
 


First published: August 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading