Modi swearing-in Ceremony live: ఆడియన్స్‌లో సుష్మాస్వరాజ్.. దక్కని కేబినెట్ బెర్త్

కాబోయే మంత్రుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీల్లో కాకుండా ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీల్లో సుష్మాస్వరాజ్‌ను కూర్చోబెట్టారు.

news18-telugu
Updated: May 30, 2019, 6:56 PM IST
Modi swearing-in Ceremony live: ఆడియన్స్‌లో సుష్మాస్వరాజ్.. దక్కని కేబినెట్ బెర్త్
సుష్మ స్వరాజ్
news18-telugu
Updated: May 30, 2019, 6:56 PM IST
2014 నుంచి 2019 వరకు నరేంద్ర మోదీ కేబినెట్‌లో విదేశాంగ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన సుష్మాస్వరాజ్‌కు ఈ సారి కేబినెట్ బెర్త్ దక్కలేదు. మోదీ రెండోసారి ప్రమాణస్వీకారం సందర్భంగా కేబినెట్‌లో చేరబోయే మంత్రుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీల్లో కాకుండా, ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో సుష్మాస్వరాజ్‌కు కుర్చీ కేటాయించారు. దీంతో ఆమెకు కేబినెట్ బెర్త్ దక్కలేదనే విషయం ఖరారైంది. సుష్మాస్వరాజ్‌కు కేంద్ర మంత్రి పదవి ఎందుకు దక్కలేదనే అంశం పై ఇంకా క్లారిటీ రాలేదు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో అనారోగ్య కారణాల రీత్యా అరుణ్ జైట్లీ తరహాలోనే ఆమె కూడా మంత్రి పదవి వద్దని సూచించారా? లేకపోతే పార్టీ పెద్దలే ఆమె అనారోగ్యం కారణంగా సుష్మా స్వరాజ్‌ను పక్కనపెట్టారా? అనే విషయం తేలాల్సి ఉంది. మరోవైపు సుష్మాస్వరాజ్ అద్వానీ టీమ్ కాబట్టి మొదటి సారి ఛాన్స్ ఇచ్చారు. రెండోసారి పక్కన పెట్టి ఉంటారనే వాదన కూడా ఉంది.

First published: May 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...