ఈతంటే చాలా ఇష్టం... చిన్నతనంలో సినిమాలు బాగా చూశాను: మోదీ

చిన్నతనంలో సినిమాలు కూడా బాగా చూసేవాడని చెప్పారు మోదీ. అయితే ప్రధాని అయ్యాక మాత్రం ఒక్క సినమా కూడా చూడలేదన్నారు.

news18-telugu
Updated: April 24, 2019, 11:12 AM IST
ఈతంటే చాలా ఇష్టం... చిన్నతనంలో సినిమాలు బాగా చూశాను: మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ
  • Share this:
ప్రధాని నరేంద్ర మోదీతో ...బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు సంబంధించిన అనేక విషయాల్ని మోదీ అక్షయ్‌తో పంచుకున్నారు. చిన్ననాటి జ్ఞపకాల్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. స్కూల్ రోజుల్లో ఈత కొట్టడం అంటే బాగా ఇష్టమని చెప్పుకొచ్చారు. రోజు ఈత కొట్టేవాడినని గుర్తు చేసుకున్నారు మోదీ. స్విమ్మింగ్ చేయడం వల్ల శరీరం దృడంగా మారుతుందని తెలిపారు. అంతేకాకుండా తనకు టీమ్‌గా ఆడే ఆటలంటే ఎంతో ఇష్టమన్నారు. టీమ్‌గా ఆడే ఆటల్లో మనలోని ఉండే చురుకుదనాన్ని మరింత మెరుగుపరుస్తాయన్నారు. చిన్నతనంలో సినిమాలు కూడా బాగా చూసేవాడని చెప్పారు మోదీ. అయితే ప్రధాని అయ్యాక మాత్రం ఒక్క సినమా కూడా చూడలేదన్నారు.

సీఎం అయ్యేవకు తన దుస్తులు తానే ఇస్త్రీ చేసుకునేవాడినని ప్రధాని తెలిపారు. చెంబులో నిప్పులు వేసి దుస్తుల్ని ఇస్త్రీ చేసుకునేవాడినన్నారు. ఎంత ఒత్తిడిలో ఉన్న కూడా అప్పుడప్పుడు వెళ్లి తన తల్లిని కలిసివస్తానని తెలిపారు నమో. ఇప్పటికే తన తల్లి తనకు డబ్బులు ఇస్తుందన్నారు. స్కూల్ రోజుల్లోనే బ్యాంకు అకౌంట్ తెరిచినా అందులో డబ్బులు వేయలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు మోదీ. దేశాన్ని తన కుటుంబంగా మార్చుకున్నానని చెప్పారు.First published: April 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు