వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్‌కు ముహుర్తం ఖరారు

ప్రధాని మోదీ (ఫైల్)

మే 19న ఏడవ విడత ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మోదీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేసేందుకు అన్నీ రెడీ చేసుకున్నారు.

  • News18
  • Last Updated :
  • Share this:
    లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాని మోదీ నామినేషన్‌కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే యూపీలో కొన్నిస్థానల్లో ఎన్నికలు ముగిశాయి. లోక్‌సభ సీట్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్‌లో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మూడు విడతలు పూర్తయ్యాయి. అయితే ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి ఎన్నికలు ఏడవ విడతలో జరగనున్నాయి. మే 19న ఏడవ విడత ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మోదీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేసేందుకు అన్నీ రెడీ చేసుకున్నారు. వరుసగా రెండోసారి నుంచి పోటీ చేయనున్న మోదీ మరో రెండు రోజుల్లో అంటే ఈనెల 26న నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ సందర్భంగా రెండు రోజుల పాటు ఆయన అక్కడే పర్యటించనున్నారు. ఏప్రిల్ 25వ తేదీన బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి దశ్‌అశ్వమేథ్ ఘాట్ వరకు నిర్వహించే రోడ్‌షోలో మోదీ పాల్గొననున్నారు. అనంతరం కాల భైరవ ఆలయాన్ని మోదీ దర్శించనున్నారు. అదే రోజు పార్టీ కార్యకర్తలతో మోదీ సమావేశం కానున్నారు. 26న కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు మోదీ. అక్కడ్నుంచి రోడ్ షో పాల్గొని అనంతరం మోదీ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

    2014 సాధారణ ఎన్నికల్లో వారణాసితో పాటు గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నుంచి కూడా పోటీ చేసి గెలుపొందారు మోదీ. అయితే వడోదర నుంచి తప్పుకున్న మోదీ.. వారణాసి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. నాటి ఎన్నికల్లో వారణాసి స్థానం నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌పై 3 లక్షల ఓట్ల తేడాతో నరేంద్ర మోదీ విజయం సాధించారు. వడోదర స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి మధుసూద మిస్గ్రీ మీద భారీ మెజార్టీతో గెలుపొందారు మోదీ. ఈసారి కాంగ్రెస్ అధ్యక్షుడ రాహుల్ కూడా రెండుచోట్ల నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. యూపీలోని అమేథితో పాటు... కేరళలోని వయనాడ్‌లో కూడా ఆయన నామినేషన్ వేశారు.
    First published: