హోమ్ /వార్తలు /National రాజకీయం /

కాశ్మీర్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు...చేసి చూపిస్తాం: మోదీ

కాశ్మీర్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు...చేసి చూపిస్తాం: మోదీ

50ఏళ్లుగా తమ భావోద్వేగాలతో ఆడుకుంటున్న పార్టీలకు పుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారన్నారు. 35ఏ ఆర్టికల్, 370 ఆర్టికల్ రద్దు చేసైనా సరే... కాశ్మీర్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు

50ఏళ్లుగా తమ భావోద్వేగాలతో ఆడుకుంటున్న పార్టీలకు పుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారన్నారు. 35ఏ ఆర్టికల్, 370 ఆర్టికల్ రద్దు చేసైనా సరే... కాశ్మీర్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు

50ఏళ్లుగా తమ భావోద్వేగాలతో ఆడుకుంటున్న పార్టీలకు పుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారన్నారు. 35ఏ ఆర్టికల్, 370 ఆర్టికల్ రద్దు చేసైనా సరే... కాశ్మీర్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు

తాజాగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. కాశ్మీర్ ప్రత్యేక అధికారులు కల్పించే ఆర్టికల్ 370 , 35లను రద్దు చేస్తామని అందులో పొందుపరిచారు. మరి భవిష్యత్తులో ఇదే జరగనుండా ? కాశ్మీర్ ప్రత్యేక అధికారాల్ని బీజేపీ సర్కార్ రద్దు చేయనుందా ? అన్న ప్రశ్నలకు మోదీ అవుననే సమాధానమిస్తున్నారు. న్యూస్ 18 గ్రూప్... నిర్వహించిన మోదీ ఇంటర్య్వూలో ఆయన ఇలాంటి అభిప్రాయమే వ్యక్తంచేశారు. 1950లోనే కొన్ని రాజకీయ కుటుంబాలు సృష్టించిన సమస్య కాశ్మీర్ అన్నారు. వారి వల్లే ఈ తప్పిదం జరిగిందన్నారు. రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రజల సెంటిమెంట్‌ను వాడుకున్నారని విమర్శించారు. అప్పట్లో తీసుకున్న నిర్ణయాల వల్లే ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికీ ఇబ్బందులు పడుతుందన్నారు. కాశ్మీర్‌లో రాళ్లు రువ్వే యువతకు పాకిస్థాన్ నిధులిచ్చి మరి... మిలిటెంట్లను కాపాడుకుంటుందని మండిపడ్డారు మోదీ. దీనివల్ల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న NIAకు ఇబ్బందులు ఎదురువుతున్నాయన్నారు. తమ స్వార్థంకోసం రాజకీయాలు చేసే అలాంటి పొలిటికల్ పార్టీల నుంచి కాశ్మీర్ ప్రజలు విముక్తి కోరుకుంటున్నారన్నారు ప్రధాని మోదీ. 50ఏళ్లుగా తమ భావోద్వేగాలతో ఆడుకుంటున్న పార్టీలకు పుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారన్నారు. 35ఏ ఆర్టికల్, 370 ఆర్టికల్ రద్దు చేసైనా సరే... కాశ్మీర్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు

అయితే కాశ్మీర్ ప్రత్యేక అధికారులు రద్దు చేస్తే... భారత్ నుంచి విడిపోతామని మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా హెచ్చరిస్తున్నారు. ఆర్టికల్ 35 (ఎ) ప్రకారం.. రాష్ట్ర పౌరులు ఎవరు, వాళ్ల హక్కులేంటి అన్నది నిర్ణయించే హక్కు స్థానిక రాష్ట్ర అసెంబ్లీకే ఉంటుంది. బయటి ప్రాంతాలకు చెందిన వ్యక్తులు కాశ్మీర్ లో ప్రాపర్టీ కొనుగోలుకు,ఉద్యోగాలకు అప్లయ్ చేసేందుకు అవకాశం ఉండదు. ఆర్టికల్ 35Aని రద్దు చేస్తామని అనటం ద్వారా బీజేపీ బలవంతంగా తమ హక్కులను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని,తాము దీన్ని వదిలిపెట్టబోమని,ఫైట్ చేస్తామని ఫరూక్ అన్నారు.

ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 (ఎ)ను సవాలు చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు పెండింగ్‌ లో ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మోదీ, బీజేపీ ప్రభుత్వం కాశ్మీర్‌కు ప్రత్యేక అధికారులు తెచ్చే 35ఏ, ఆర్టికల్ 370 రద్దు చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది. ఆ సమయంలో అక్కడ తలెత్తే పరిస్థితుల్ని మోదీ సర్కార్ సద్దుమణిగేలా చేస్తుందా? అంటే వేచిచూడాల్సిందే.

First published:

Tags: Lok Sabha Election 2019, Narendra modi, National News, Pm modi

ఉత్తమ కథలు