ఇది బిహారీలకు అవమానం కాదా?.. ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మోదీ తన తొలి ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

news18-telugu
Updated: October 23, 2020, 12:26 PM IST
ఇది బిహారీలకు అవమానం కాదా?.. ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ
బిహార్ ఎన్నిక ప్రచార సభలో ప్రధాని మోదీ(Image-ANI)
  • Share this:
"ఎన్డీయే ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. కానీ ప్రతిపక్ష పార్టీలు తాము అధికారంలోకి వస్తే ఆ ఆర్టికల్‌ను పునరుద్దరిస్తామని చెబుతున్నాయి. ఇలా చేయడం ద్వారా వారు బిహారీలను అవమానించినట్టు కాదా?. దేశ రక్షణ కోసం తన కొడుకులను, కూతుళ్లను సరిహద్దుల్లోకి పంపుతున్న బిహార్‌కు అవమానం కాదా" అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మోదీ తన తొలి ప్రచార సభలో పాల్గొన్నారు. స‌సారామ్‌లోని బైడా మైదాన్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల మరణించిన రామ్ విలాస్ పాశ్వాన్, రఘువంశ్ ప్రసాద్‌లకు ఆయన తొలుత నివాళులర్పించారు. బిహార్ ఇటీవల తన ఇద్దరు కుమారులను కోల్పోయిందన్నారు. వాళ్లిద్దరు తుదిశ్వాస వరకు బిహార్ ప్రజల అభివృద్ది కోసం తనతో ఉన్నారని అన్నారు.

గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో బీహారీ బిడ్డ‌లు ప్రాణాలు కోల్పోయార‌ని, అలాగే పుల్వామా ఉగ్రదాడిలో కూడా పలువురు బిహారీ జవాన్లు అమరులయ్యారని అన్నారు. వారందరికీ ఆయన తలవంచి నమస్కారం చేశారు. . కరోనాను ఎదర్కొవడంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కఠిన నిబంధనలు అమలు చేశారని.. ఆయన అలా చేయకుంటే పరస్థితులు దారుణంగా తయ్యారయ్యేవని అన్నారు. ప్రజలు కూడా కరోనాపై పోరులో ఎంతగానో సహకరించారని అభినందించారు. పోలింగ్‌కు ముందే బిహార్ ప్రజలు తమ సందేశాన్ని ఇచ్చారని.. అని సర్వేలు బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయని తెలిపారు. అభివృద్ధి పథంలో నడిపిన పాలకులను మరోసారి గెలిపించుకునేందకు ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. గతంలో బిహార్‌ను పాలించిన వారు.. అభివృద్దిలో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టిన విషయాన్ని ఇక్కడి ప్రజలు మరిచిపోవద్దని కోరారు. ఆ సమయంలో బిహార్‌లో శాంతిభద్రతలు క్షీణించిందని, అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు.

ఎన్డీయే హయాంలో బిహార్‌లో కనెక్టివిటీ పెరిగిందన్నారు. దాదాపు అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించామని చెప్పారు. జాతీయ రహదారులను విస్తరించామని చెప్పారు. బిహార్‌లోని నదులపై కొత్త, అధునాతన బ్రిడ్జిలను ఒకటి తర్వాత ఒకటి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇక, పోలింగ్ సమయం దగ్గరపడుతున్న వేళ బిహార్‌లో రాజకీయ వేడి క్రమంగా పెరుగుతోంది. అగ్ర నాయకుల ప్రచార సభలతో ఎన్నికల ప్రచారం మరింత హోరెత్తనుంది.
Published by: Sumanth Kanukula
First published: October 23, 2020, 12:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading