అవినీతిపై ప్రభుత్వం యుద్దం చేస్తుందంటూ... 2014లో అధికారంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అయ్యింది. ఈ ఐదేళ్లలో అవినీతి పరుల ఆటకట్టించింది. మూలనపడిన అవినీతి కేసుల్ని తిరగతోడిందా? అంటే అవుననే సమాధానమిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. న్యూస్ 18 గ్రూప్... ప్రధాని మోదీని ఇదే విషయంపై ఆయన అభిప్రాయం కోరింది. దీనిపై స్పందించిన నమో... మా హయాంలో అవినీతికి అడ్డుకట్ట వేశామన్నారు. ఐదేళ్ల కాలంలో అవినీతికి వ్యతిరేకంగా అనేకసార్లు దాడులు చేశామన్నారు. మేం పోరాడకుంటే మధ్యప్రదేశ్ భోపాల్‌లో అక్రమాలు బయటపడేవా ? అవినీతిపరుడు ఏం చెప్తున్నాడనేది మాకు అనవసరం. భోపాల్‌లో అధికారులు చేస్తున్న దాడులు అవినీతికి వ్యతిరేకం కాదా ? నేషనల్ హెరాల్డ్ కేసు మా హయాంలో జరిగిందా? లాలూ ప్రసాద్ యాదవ్ దాణా స్కాం మా పాలనలో జరిగిందా? అయినప్పటికీ... కోల్డ్‌స్టోరేజ్‌లో పడిఉన్న అవినీతి కేసులన్నింటికి బయటకు తీశామన్నారు. ఆ లాలూ ప్రస్తుతం జైల్లో ఉండగా... సోనియా రాహుల్‌ను ఉద్దేశిస్తూ... తల్లికొడుకులు బెయిల్ తీసుకొని బయట తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు మోదీ.
అవినీతిపై మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల వేళ ప్రతిపక్షాలనే కార్నర్ చేస్తూ... అవినీతిపై బీజేపీ సర్కార్ గట్టి చర్యలు తీసుకుంటుందన్న ధీటైన సమాధానమిచ్చారు ప్రధాని. న్యూ 18 ఇంటర్య్వూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Lok Sabha Election 2019, Narendra modi, Pm modi, Rahul Gandhi, Sonia gnahdi