PM MODI QUESTIONS CONGRESS PAKISTAN CHEMISTRY AT HARYANA RALLY BS
సైనిక భద్రతను బలోపేతం చేశాం.. హర్యానా సభలో ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ
అధికారంలోకి వచ్చాక సైనిక భద్రతను బలోపేతం చేశామని, ఆధునిక ఆయుధాలు కొనుగోలు చేసి దేశ భద్రతను రెట్టింపు చేశామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అధికారం చేపట్టగానే భద్రతా దళాలను మరింత పటిష్ఠంగా మార్చేందుకు ఏకంగా ఒక మిషన్నే ప్రారంభించామని వెల్లడించారు.
అధికారంలోకి వచ్చాక సైనిక భద్రతను బలోపేతం చేశామని, ఆధునిక ఆయుధాలు కొనుగోలు చేసి దేశ భద్రతను రెట్టింపు చేశామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అధికారం చేపట్టగానే భద్రతా దళాలను మరింత పటిష్ఠంగా మార్చేందుకు ఏకంగా ఒక మిషన్నే ప్రారంభించామని వెల్లడించారు. అదే.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు మాత్రం తేజస్ యుద్ధవిమానాలను పక్కన పెట్టేసిందని, తాము అధికారంలోకి వచ్చాక ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని వివరించారు. ఇప్పుడు వాయు సేనకు ఆ యుద్ధ విమానాలు అద్భుత సేవలు అందిస్తున్నాయని కొనియాడారు. శనివారం నాడు ఆయన హర్యానాలోని సిర్సా సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాఫెల్ యుద్ధ విమానాల గురించి మాట్లాడారు. రాఫెల్ లాంటి అత్యాధునిక యుద్ధ విమానాలు, సబ్ మరైన్లు భారత అమ్ములపొదిలో చేరుతున్నాయని చెప్పారు. అంతకుముందు మహారాష్ట్రలోని సతారా సభలో పాల్గొన్న మోదీ.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్.. ఇలా మూడు విభాగాల్లో భద్రతా దళాలకు ఆధునిక ఆయుధాలు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు.
ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చొరవతో ఫ్రాన్స్‌తో రాఫెల్ యుద్ధ విమానాల డీల్ కుదిరిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. 36 రాఫెల్ జెట్ల కోసం రూ.59వేల కోట్లతో భారత్, ఫ్రాన్స్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తొలి నాలుగు జెట్లు 2020 మే నాటికి భారత్ చేతికి అందనున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక భద్రతా సిబ్బంది కోసం రూ.8500 కోట్లతో ఆధునిక ఆయుధాలను కొనుగోలు చేసింది. రష్యా కూడా అకుల క్లాస్ సబ్మరైన్ల(చక్ర 3)ను 2025 నాటికి భారత్‌కు అందజేయనుంది.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.