Home /News /politics /

PM MODI PROMISES NAVA PUNJAB FREE OF DRUGS SLAMS GANDHI FOR RUNNING REMOTE CONTROL GOVT MKS

Nava Punjab: నవ పంజాబ్ నిర్మిస్తామన్న ప్రధాని.. జలంధర్ సభ సక్సెస్.. సర్దార్జీ పగిడీలో మోదీ

పంజాబ్ ఎన్నికల ప్రచారంలో మోదీ

పంజాబ్ ఎన్నికల ప్రచారంలో మోదీ

న్యూ ఇండియా లక్ష్యంతో కేంద్రంలో పరిపాలన సాగిస్తోన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడు నవ పంజాబ్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. జంలంధర్ లో బీజేపీ నిర్వహించిన సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు..

న్యూ ఇండియా లక్ష్యంతో కేంద్రంలో పరిపాలన సాగిస్తోన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడు నవ పంజాబ్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. పంజాబ్‌లో రాబోయే ఎన్‌డీయే ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ సోమవారం జలంధర్ లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని.. ఫెడరల్ వ్యవస్థ, నవ పంజాబ్, కాంగ్రెస్ రిమోట్ కంట్రోల్ పాలన, సైన్యంపై కాంగ్రెస్ నేతల అవాకులు తదితర అంశాలపై మాట్లాడారు.

తాము సమాఖ్య వ్యవస్థను గౌరవిస్తున్నామని ప్రధాని మోదీ వక్కాణించారు. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సమాఖ్య విధానం ప్రకారం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేశారన్నారన్న ప్రధాని.. ఈ ఎన్నికల్లో ఎన్డీయేదే గెలుపని, మాదకద్రవ్యాలు, రుణాల నుంచి నవ పంజాబ్ విముక్తి అవుతుందని భరోసా ఇచ్చారు. రైతులకు ప్రయోజనాలురైతుల కోసం బీజేపీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. 23 లక్షల మంది పంజాబ్ రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి క్రింద లబ్ధి పొందుతున్నారని గుర్తుచేశారు.

Surgical strike ఆధారాలివిగో : ఆర్మీని బద్నాం చేసిన CM KCR: అస్సాం సీఎం దిమ్మతిరిగే కౌంటర్ Video

ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనను అడ్డుకుంటామని రైతు సంఘాలు హెచ్చరించన నేపథ్యంలో నేటి జంలంధర్ సభకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, రైతులకు తామెంతో చేస్తున్నామని మోదీ తెలిపారు. అర్హులైన రైతుల ఖాతాలకు సంవత్సరానికి రూ.6,000 చేరుతోందని, ఎరువులు, పురుగు మందులను అంతర్జాతీయ మార్కెట్ ధరల కన్నా తక్కువ ధరలకు అందజేస్తున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయంపై కృషి చేస్తామన్నారు.

CM KCR: కాంగ్రెస్‌తో పొత్తుపై కేసీఆర్ కుండబద్దలు -ఆ విషయంలో Rahul Gnadhiకి కడదాకా మద్దతు


పంజాబ్ లో అధికార కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించిన మోదీ.. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ హైకమాండ్ రిమోట్ కంట్రోల్ ద్వారా పంజాబ్ లో పాలన చేస్తోందన్నారు. 1984లో సిక్కులపై జరిగిన దాడులపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని, కాంగ్రెస్ మాత్రం ఈ దాడుల్లో నిందితులకు ఉన్నత స్థాయి పదవులను ఇచ్చిందని ప్రధాని గుర్తుచేశారు. భారత సైన్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని మండిపడ్డారు. పంజాబ్ లో భద్రత పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని, త్వరలోనే త్రిపురమాలిని దేవికి ప్రత్యేక పూజలు చేస్తానని మోదీ తెలిపారు. అంతకుముందు, పుల్వామా అమరవీరులకు ప్రధాని నివాళి అర్పించారు. పంజాబ్ కంటే ముందు ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లోనూ మోదీ ఎన్నికల సభ నిర్వహించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022, Bjp, Pm modi, Punjab

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు