లోక్‌సభ సమావేశాలు ప్రారంభం.. ఎంపీగా మోదీ ప్రమాణ స్వీకారం

Modi takes oath as MP : లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి ముందు ప్రొటెం స్పీకర్‌గా వీరేంద్ర కుమార్‌తో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు.సభలో నేడు, రేపు సభ్యుల ప్రమాణ స్వీకారం కొనసాగనుంది. బుధవారం లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది.

news18-telugu
Updated: June 17, 2019, 4:31 PM IST
లోక్‌సభ సమావేశాలు ప్రారంభం.. ఎంపీగా మోదీ ప్రమాణ స్వీకారం
నరేంద్ర మోదీ
news18-telugu
Updated: June 17, 2019, 4:31 PM IST
భారత 17వ లోక్‌సభ మొదటి సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఎంపీలుగా ఎన్నికైన సభ్యుల చేత ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. మొదట ప్రధాని మోదీతో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయించారు.సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో మోదీ మీడియాతో మాట్లాడారు. లోక్‌సభలో అధికార పక్షం, విపక్షం అన్న బేధాలను పక్కనపెట్టి.. దేశ సమస్యలపై నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.ప్రతిపక్షం తమ సభ్యుల సంఖ్య తక్కువగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ అభిప్రాయాలు కూడా కీలకమే అని చెప్పారు. ప్రతిపక్షం తమ పాత్రను సమర్థవంతంగా పోషిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.ఈ సభలో ఎక్కువ మంది మహిళా ఎంపీలు ఉన్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని.. సమావేశాలు సజావుగా కొనసాగుతూ ప్రజా ఆకాంక్షలను నెరవేర్చేలా సాగాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.

ప్రధాని మోదీతో పాటు ఎంపీలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, స్మృతీ ఇరానీలు కూడా నేడు ప్రమాణ స్వీకారం చేశారు.లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి ముందు ప్రొటెం స్పీకర్‌గా వీరేంద్ర కుమార్‌తో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు.సభలో నేడు, రేపు సభ్యుల ప్రమాణ స్వీకారం కొనసాగనుంది. బుధవారం లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది.


First published: June 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...