Home /News /politics /

PM MODI MEETING OVER GOVT FORMATION IN UP GOA AND UTTARAKHAND SHAH NADDA ATTENDS AND BIREN FINALISED AS 2ND TIME MANIPUR CM MKS

4 డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు.. ఇసారి కూర్పు ఎలా? -PM Modi కీలక భేటీ -మణిపూర్‌కు మళ్లీ బీరేనే సీఎం

ప్రధాని మోదీ (పాత ఫొటో)

ప్రధాని మోదీ (పాత ఫొటో)

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి కీలక భేటీ నిర్వహించారు. వివరాలివే..

కేంద్రంలో, రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉంటే డబుల్ ఇంజన్ స్పీడుతో అభివృద్దిని పరుగులు తీయించవచ్చనే ప్రధాని మోదీ పిలుపును ఓటర్లు అందిపుచ్చుకోవడం, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన నాలుగు రాష్ట్రాలనూ నిలబెట్టుకోవడం తెలిసిందే. గెలిచిన నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుపై ప్రధాని మోదీ కీలక భేటీ నిర్వహించారు. ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో ఆదివాసంర సాయంత్రం జరిగిన భేటీకి హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, సంస్థాగత(ఆర్ఎస్ఎస్) కార్యదర్శి బీఎల్ సంతోశ్ తదితరులు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటు, కేబినెట్ కూర్పులపై నేతలు చర్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో 37 ఏళ్ల రికార్డును చెరిపేస్తూ వరుసగా రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడం, యోగి ఆదిత్యానాథ్ మరోసారి సీఎం కానుండటం తెలిసిందే. ఈనెల 25న యోగి రెండోసారి యూపీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. గత వారం ఢిల్లీలో పర్యటించిన యోగి.. మోదీసహా కీలక నేతలను కలిసి కేబినెట్ కూర్పుపై చర్చించారు. ఇవాళ్టి ప్రధాని భేటీలోనూ యూపీ కేబినెట్ కూర్పుపై చర్చించినట్లు తెలిసింది. యోగి కేబినెట్ 2.0 గతానికి భిన్నంగా ఉండేలా పార్టీ మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.

పున్నమినాగు 2.0: ఒకే వ్యక్తికి 500 సార్లు పాము కాటు.. జనం మధ్యలో ఉన్నా పగపట్టినట్టు అతణ్నే!!


చిన్న రాష్ట్రం గోవాలో స్వతంత్రుల మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. కానీ ప్రమోద్ సావంత్ ను ముఖ్యమంత్రిగా కొనసాగించాలా? కొత్తవారికి అవకాశం కల్పించాలా? అనేది ఇంకా ఖరారు కాలేదు. ఎక్కువ శాతం అవకాశం సావంత్ కే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నా, కచ్చితమైన ప్రకటనేదీ ఇంకా రాలేదు. ఉత్తరాఖండ్ లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సోమవారం డెహ్రాడూన్ లో సమావేశమై, బీజేపీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. సిట్టింగ్ సీఎం పుష్కర్ ధామి ఎన్నికల్లో ఓడిపోవడంతో కొత్త సీఎంను ఎంచుకోవాల్సిన పరిస్థితి. సోమవారం నాటి మీటింగ్ లోనే సీఎం అభ్యర్థి ఎవరనేది ఖరారుకానుంది. ఇక,

Petrol Diesel Price: లీటర్‌ డీజిల్‌పై రూ.25 పెంపు.. బల్క్‌ యూజర్లపై భారీ బాదుడు..


బీజేపీ తాజాగా గెలిచిన నాలుగు రాష్ట్రాల్లో యూపీలో సీఎంగిరీకి ఎలాంటి అడ్డులేకున్నా, మిగిలిన మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఎంపికను పార్టీ నిశితంగా చేపట్టింది. మణిపూర్ లో బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చినా, సీఎం బీరేన్ సింగ్ ను మార్చుతారని ఇవాళ మధ్యాహ్నం దాకా చర్చ జరిగింది. కానీ సాయంత్రానికిగానీ బీరేనే సీఎంగా కొనసాగుతారనే అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నాలుగు డబుల్ ఇంజన్ ప్రభుత్వాల కూర్పు ఎలా ఉండాలనేది మోదీ చూచాయగా నిర్ధారిస్తారని తెలుస్తోంది.
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022, Bjp, Pm modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు