PM Narendra Modi | కాంగ్రెసేతర తొలి ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు

Prime Minister Narendra Modi Birthday| ప్రధాని నరేంద్ర మోదీ ఓ అరుదైన ఘనత సాధించారు. దేశంలో అత్యధికకాలం దేశ ప్రధానిగా పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ(70) రికార్డు సృష్టించారు.

news18-telugu
Updated: September 17, 2020, 12:06 PM IST
PM Narendra Modi | కాంగ్రెసేతర తొలి ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు
దేశ ప్రధాని నరేంద్ర మోదీ(Pic: Getty)
  • Share this:
PM Narendra Modi 70th Birthday: ప్రధాని నరేంద్ర మోదీ ఓ అరుదైన ఘనత సాధించారు. దేశంలో అత్యధికకాలం దేశ ప్రధానిగా పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ(70) రికార్డు సృష్టించారు. గతంలో ధివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరిట ఈ రికార్డు ఉండేది. వాజ్‌పేయి మూడు దఫాలూ కలుపుకుని 2,272 రోజులు దేశ ప్రధానిగా పనిచేయగా... నరేంద్ర మోదీ ఆగస్టు 13న వాజ్‌పేయిని అధిగమించారు. ప్రధాని మోదీ రెండు దఫాలు కలుపుకుని ఇప్పటి వరకు 2,321 రోజులు దేశ ప్రధానిగా సేవలందించారు.

తద్వారా నెహ్రూ, ఇంధిరాగాంధీ, మన్మోహన్ సింగ్ తర్వాత దేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నాలుగో వ్యక్తిగా మోదీ రికార్డు సృష్టించారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ 2014 మే 26న తొలిసారి ప్రమాణ స్వీకారం చేయగా...2019 మే 30న రెండోసారి దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు.

అత్యధిక కాలం దేశ ప్రధానిగా పనిచేసిన నాలుగో ప్రధానిగా మోదీ రికార్డు


దేశంలో ఇప్పటి వరకు అత్యధిక కాలం దేశ ప్రధానిగా పనిచేసిన రికార్డు మాత్రం తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూదే. ఆయన 6,130 రోజులు దేశ ప్రధానిగా పనిచేశారు.

దేశ ధివంగత మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ


జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత స్థానాల్లో ఇంధిరా గాంధీ రెండో స్థానంలో ఉన్నారు. ఆమె 5,829 రోజులు దేశ ప్రధానిగా సేవలందించారు.

Former Prime Minister Dr Manmohan Singh discharged from AIIMS
మన్మోహన్ సింగ్ (Twitter Photo)
నరేంద్ర మోదీకి ముందు దేశ ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ అత్యధిక కాలం దేశ ప్రధానిగా పనిచేసిన మూడో వ్యక్తిగా కొనసాగుతున్నారు. ఆయన 3,656 రోజులు దేశ ప్రధానిగా సేవలందించారు.

vajpayee, narendra modi, vajpayee age
భారత రత్న అటల్ బిహారి వాజ్‌పేయి (ఫైల్ ఫోటో)


దేశ ప్రధానిగా అత్యధిక కాలం సేవలందించిన నాలుగో వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ కాగా... వాజ్‌పేయి ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నారు. వాజ్‌పేయి 2,272 రోజులు దేశ ప్రధానిగా సేవలందించారు.
Published by: Janardhan V
First published: September 17, 2020, 12:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading