మోదీకి రాజకీయ పరిజ్ఞానం లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఎంపీ..

Asaduddin Owaisi: ఆర్టికల్ 370 రద్దు గురించి మాట్లాడిన ఒవైసీ.. సర్దార్‌ పటేల్‌, పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రుకు ఉన్న రాజకీయ పరిజ్ఞానం ప్రధాని నరేంద్ర మోదీకి లేదని ఒవైసీ వ్యాఖ్యానించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 14, 2019, 3:48 PM IST
మోదీకి రాజకీయ పరిజ్ఞానం లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఎంపీ..
ప్రధాని నరేంద్ర మోదీ (File)
  • Share this:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాజకీయ పరిజ్ఞానం లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఆర్టికల్ 370 రద్దు గురించి మాట్లాడిన ఒవైసీ.. సర్దార్‌ పటేల్‌, పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రుకు ఉన్న రాజకీయ పరిజ్ఞానం ప్రధాని నరేంద్ర మోదీకి లేదని ఒవైసీ వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆనాడు కశ్మీర్‌ అంశంపై వాళ్లు సరైన నిర్ణయం తీసుకున్నారని, భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ కూడా ఆర్టికల్‌ 370ను అంగీకరించారని అన్నారు. అయితే, ఆ విషయం మోదీకి తెలియదని ఒవైసీ చెప్పారు. ‘ఎన్డీయే ప్రభుత్వం కశ్మీర్‌ను ప్రేమిస్తోంది. కానీ, అక్కడ ఉన్న కశ్మీరీలను కాదు. ఆ భూమిపై ప్రేమ ఉంది. కానీ, అక్కడ నివసిస్తున్న ప్రజలపై మోదీకి ప్రేమ లేదు. న్యాయాన్ని వదిలేసిన బీజేపీ నాయకులు.. మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఎవరికైనా ఏది శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని ఒవైసీ స్పష్టం చేశారు.

ఇక, ఆర్టికల్ 370 రద్దుకు తానెప్పటికీ మద్దతు ఇవ్వబోనని తేల్చి చెప్పారు. మరోవైపు, మోదీ, అమిత్ షా‌ను కృష్ణార్జునులుగా సూపర్‌స్టార్ రజనీకాంత్ పోల్చడంపై స్పందిస్తూ.. మరి పాండవులు, కౌరవులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. దేశంలో మరో మహాభారతాన్ని కోరుకుంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

First published: August 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...