PM MODI INTERACTS WITH BJP WORKERS IN VARANASI THROUGH NAMO APPP ASKS HOW IS UP ASSEMBLY ELECTION ATMOSPHERE MKS
UP Elections 2022 మూడ్ ఎలా ఉంది? -PM Modi ఆరా -అదిరిపోయే ఐడియా ఇచ్చారుగా!
నమో యాప్ ద్వారా బీజేపీ కార్యకర్తలతో మోదీ
ఈ సందర్భంగా మోదీ ఓ వినూత్న ఐడియాను కార్యకర్తలతో పంచుకున్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో ఎక్కడికక్కడే పార్టీ పరంగా డొనేషన్ క్యాంపులను ప్రారంభించాలన్నారు. బూత్ పరిధిలోని అభిమానుల నుంచి పార్టీ నిధులు సేకరించాలని, పెద్ద మొత్తాల్లో కాకుండా..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలోని బీజేపీ సాధారణ కార్యకర్తలతో సమాలోచనలు జరిపారు. ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల మూడ్ ఎలా ఉందని ఆరా తీశారు. బీజేపీ గెలుపు కోసం ఓ సరికొత్త ఐడియాను కూడా షేర్ చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ముఖాముఖి కాకుండా, అలాగని ఫేస్ లైమ్ లోకీ రాకుండా, కేవలం ఆడియో కాల్ ద్వారానే బీజేపీ కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయ్యారు. నమో యాప్ ద్వారా మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని కీలక వ్యాఖ్యలు, సూచనలు చేశారు. యూపీ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటూ కీలకమేననంటూ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. బీజేపీ శ్రేణులతో మోదీ ఇంటరాక్షన్ వివరాలను నమో యాప్ ద్వారానే వెల్లడించారు.
నమో యాప్ ద్వారా నేడు వారణాసిలోని బీజేపీ కార్యకర్తలతో సంభాషణ జరిపిన ప్రధాని మోదీ.. యూపీలో డబుల్ ఇంజన్ బీజేపీ సర్కారు అమలు చేస్తోన్న పథకాలను ప్రజలందరికీ వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని గుర్తుచేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు బీజేపీ కార్యకర్తలు మరింత చేరువ కావాలని కోరారు. ఈ సందర్భంగా మోదీ ఓ వినూత్న ఐడియాను కార్యకర్తలతో పంచుకున్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో ఎక్కడికక్కడే పార్టీ పరంగా డొనేషన్ క్యాంపులను ప్రారంభించాలన్నారు. బూత్ పరిధిలోని అభిమానుల నుంచి పార్టీ నిధులు సేకరించాలని, పెద్ద మొత్తాల్లో కాకుండా అతి తక్కువ డబ్బును ఎక్కువ మంది నుంచి కలెక్ట్ చేయాలని, అలా వచ్చిన డబ్బును ఎన్నికల ప్రచారానికి వాడుకోవచ్చని మోదీ సూచించారు.
‘బూత్ స్థాయిలో డొనేషన్ క్యాంపులు పెట్టాలని నేను కోరేంది డబ్బులు కలెక్ట్ చేయడానికి కాదు.. మనుషుల్ని సేకరించుకోడానికని గుర్తుపెట్టుకోండి’అని బీజేపీ కార్యకర్తలకు మోదీ వివరించారు. వ్యవసాయ రంగం, కాశీ విశ్వనాథ్ ధామ్, మహిళా సాధికారత, అభివృద్ధి, ఆరోగ్య వ్యవస్థల్ని మెరుగుపర్చుకోవడం తదితర అంశాలపై ప్రధాని మోదీ తన ఆలోచనలను కార్యకర్తలతో పంచుకున్నారు. రసాయనాలు లేని వ్యవసాయం చేసే దిశగా రైతులను బీజేపీ శ్రేణులు నడిపించాలని మోదీ కోరారు.
ఐదు రాష్ట్రాల షెడ్యూల్ ప్రకటన, కరోనా మూడో వేవ్ కంటే ఉత్తరప్రదేశ్ లో విస్తృతంగా పర్యటించిన ప్రధాని మోదీ పెద్ద ఎత్తున అభివృద్ధి పనుల్ని ప్రారభించడం తెలిసిందే. మొత్తం 403 సీట్లున్న యూపీ అసెంబ్లీకి ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. టికెట్ల పంపిణీని వేగవంతం చేసిన బీజేపీ ఇప్పటికే పలువు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కరోనా నేపథ్యంలో బహిరంగ సభలపై ఈసీ నిషేధం విధించడంతో నేతలంతా వర్చువల్, ఇతర మార్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.