Modi Returns | ప్రపంచం దృష్టిలో భారత్ గౌరవం పెరిగింది.. ఆ ఘనత ప్రజలదేనన్న మోదీ

news18-telugu
Updated: September 28, 2019, 9:09 PM IST
Modi Returns | ప్రపంచం దృష్టిలో భారత్ గౌరవం పెరిగింది.. ఆ ఘనత ప్రజలదేనన్న మోదీ
పాలెం విమానాశ్రయం వద్ద మాట్లాడుతున్న ప్రధాని మోదీ (Image:ANI)
  • Share this:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనను ముగించుకుని భారత్‌కు తిరిగిచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో బీజేపీ శ్రేణులు నరేంద్రమోదీకి ఘనస్వాగతం పలికారు. సుమారు 30 వేల మందికి పైగా బీజేపీ కార్యకర్తలు జాతీయ జెండాలు చేతబూని నరేంద్ర మోదీకి స్వాగతం పలికారు. పాలెం విమానాశ్రయంలో ప్రధాని మోదీకి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా స్వాగతం పలికారు. నడ్డాతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, నేతలు ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయంలో నుంచి ప్రధాని మోదీ వాహన శ్రేణిలో బయటకు వచ్చారు. విమానాశ్రయం బయట ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వచ్చారు. మోదీని బీజేపీ నేతలు గజమాలతో సత్కరించారు. అనంతరం తనకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వచ్చిన బీజేపీ కార్యకర్తలు, ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

2014లో అమెరికా, ఐరాస వెళ్లా. ఇప్పుడూ వెళ్లా. ఐదేళ్లలో ప్రపంచం దృష్టిలో భారత్ మీద గౌరవం పెరిగింది. ఆ ఘనత 130 కోట్ల ప్రజలది. ప్రపంచం నలుమూలలా ఉన్న భారతీయులది. హ్యూస్టన్‌లో #HowdyModi కార్యక్రమం ఘనవిజయం సాధించింది. భారత్, అమెరికా మధ్య స్నేహం ప్రపంచానికి మరోసారి తెలిసింది. ప్రపంచం మొత్తం మీద భారత్ ఎంత ప్రభావం చూపించవచ్చో తెలిపారు.

నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

మూడేళ్ల క్రితం సర్జికల్ స్ట్రైక్స్ చేసిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ఆ రోజు రాత్రి తాను నిద్రపోలేదని ఫోన్ ఎప్పుడు రింగ్ అవుతుందా అని కళ్లల్లో వెయ్యి వత్తులు పెట్టుకుని ఎదురుచూశానన్నారు. రేపటి నుంచి శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభం కానుండడంతో అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. అనంతరం పాలెం విమానాశ్రయం నుంచి కొంత దూరం నడుచుకుంటూ వెళ్లారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారికి చేతులు ఊపుతూ అభినందనలు తెలిపారు. విమానాశ్రయం నుంచి లోక్ కల్యాణ్ మార్గ్ వరకు అడుగడుగునా అభిమానులు మోదీకి జననీరాజనం పట్టారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 28, 2019, 9:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading