గోవులు అనగానే కొంతమంది గగ్గోలు పెడుతున్నారు.. వారివల్లే దేశం నాశనమైపోతోంది : మోదీ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ జంతు వ్యాధి నియంత్రణ కార్యక్రమం(NADCP) కార్యక్రమం ద్వారా గొర్రెలు,మేకలు,పందులు,గేదెలు,ఆవులు వంటి జంతువుల్లో నోటికి,కాళ్లకు సంక్రమించే వ్యాధులను నియంత్రించనున్నారు.

news18-telugu
Updated: September 11, 2019, 2:43 PM IST
గోవులు అనగానే కొంతమంది గగ్గోలు పెడుతున్నారు.. వారివల్లే దేశం నాశనమైపోతోంది : మోదీ
నరేంద్ర మోదీ(File)
  • Share this:
బీజేపీ సర్కార్ గోవులకు ప్రాధాన్యతనిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు.గోవుల విషయంలో బీజేపీ అనుసరిస్తున్న పాలసీలను విమర్శిస్తున్నవారిపై ఆయన విరుచుకుపడ్డారు.గోవులకు ప్రాధాన్యత ఇచ్చినంత మాత్రానా.. దేశం నాశనమైపోతున్నట్టు కొంతమంది గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు.'కొంతమందికి ఆవు,ఓం అన్న పదాలు వినిపిస్తే చాలు.. దేశం మధ్య యుగాల్లోకి వెళ్తోందని గగ్గోలు పెడుతుంటారు.. నిజానికి అలాంటివాళ్ల వల్లే దేశం నాశనమైపోతోంది' అని చెప్పుకొచ్చారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని మథురలో జాతీయ జంతు వ్యాధి నియంత్రణ కార్యక్రమం(NADCP)ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ జంతు వ్యాధి నియంత్రణ కార్యక్రమం(NADCP) కార్యక్రమం ద్వారా గొర్రెలు,మేకలు,పందులు,గేదెలు,ఆవులు వంటి జంతువుల్లో నోటికి,కాళ్లకు సంక్రమించే వ్యాధులను నియంత్రించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 50కోట్ల పశువులకు టీకాలు ఇవ్వనున్నారు. 2025కల్లా వ్యాధుల నియంత్రణ,2030కల్లా పూర్తిగా వ్యాధి నివారణ చేపట్టాలన్న లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు.


First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు