ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం నుంచి మొట్టమొదటి షాక్ తగిలింది. జగన్ సీఎం అయిన తర్వాత చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష చేస్తామని, అవసరమైతే వాటిని మార్చేస్తామని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే, జగన్ వైఖరి సరికాదని కేంద్రం లేఖ రాసింది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యానికి కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్ ఆ లేఖ రాశారు. పీపీఏలను పునఃసమీక్షించడం వల్ల పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అలాగే, దీని ప్రభావం భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టేవారి మీద కూడా పడుతుందని అభిప్రాయపడింది. దీని వల్ల భవిష్యత్తులో కంపెనీలు రాష్ట్రం, దేశంలో పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి సంశయిస్తాయని చెప్పింది.
ఎల్వీ సుబ్రమణ్యంకు కేంద్రం రాసిన లేఖ
2022 నాటికి దేశవ్యాప్తంగా 175 గిగావాట్ల పునరుద్పాదక ఇంథనాన్ని ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో 100 గిగావాట్లు సోలార్ పవర్, 60 గిగావాట్లు పవన శక్తి, 10 గిగావాట్లు బయోమాస్ ద్వారా, 5 గిగావాట్లను చిన్న హైడ్రో ప్రాజెక్టుల ద్వారా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పీపీఏలను సమీక్షించి వాటిని రద్దు చేస్తే కేంద్రం లక్ష్యం దెబ్బతింటుందని హెచ్చరించింది. ఈ విషయాలను ముఖ్యమంత్రికి తెలియజేయాల్సిందిగా లేఖలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను కోరారు కేంద్ర ఇంథన శాఖ కార్యదర్శి.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.