వారణాసిలో కాసేపట్లో ప్రధాని మోదీ నామినేషన్ వేయనున్నారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. మోదీ నామినేషన్ సందర్భంగా వారణాసికి బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ఎన్డీయే పక్షాల నేతలు సైతం హాజరయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, లోక్ జనశక్తి పార్టీ చీఫ్ రాంవిలాశ్ పాశ్వాన్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్, అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం... మోదీతో పాటు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు.
Varanasi: Prime Minister Narendra Modi arrives at Collectorate office to file his nomination from Varanasi parliamentary constituency, meets NDA leaders present there pic.twitter.com/WlPYiobUIP
— ANI UP (@ANINewsUP) April 26, 2019
మోదీ నామినేషన్ కార్యక్రామానికి ఎన్డీయే పక్షాల నేతలతో పాటు బీజేపీ చీఫ్ అమిత్ షా, సీఎం యోగి ఆదిత్యనాథ్, అసోం సీఎం సర్వానంద సోనేవాల్, హోమంత్రి రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయెల్, హేమామాలిని, జయప్రద, మనోజ్ తివారి, రవి కిషన్ సహా పలువురు నేతలు హాజరయ్యారు.
అంతకుముందు హోటల్ డిప్యారిస్లో బీజేపీ కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం
కాలభైరవుడి ఆలయలో ప్రత్యేక పూజలుచేశారు ప్రధాని మోదీ. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వెళ్తూ దారి మధ్యలో సర్దార్ వల్లభభాయ్ పటేల్, స్వామి వివేకానంద, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడి నుంచి నేరుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Pm modi, Uttar Pradesh Lok Sabha Elections 2019, Varanasi, Varanasi S24p77