జగన్‌కు మోదీ షాక్... మాతృభాషపై సంచలన వ్యాఖ్యలు

ఇది అందరికీ స్ఫూర్తి కావాలని, ఎవరి భాషను వారు, వారి యాసతో ఉపయోగించడం ప్రారంభించాలని మోడి సూచించారు.

news18-telugu
Updated: November 25, 2019, 10:55 AM IST
జగన్‌కు మోదీ షాక్... మాతృభాషపై సంచలన వ్యాఖ్యలు
జగన్, మోదీ
  • Share this:
ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2020-21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు,2 021-22 విద్యా సంవత్సరంలో తొమ్మిది తరగతిలో, 2022-23లో పదో తరగతిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు విడుదల చేసింది. ఓవైపు ఏపీ సీఎం జగన్... స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంకు కసరత్తులు చేస్తుంటే.. మరోవైపు మోదీ జగన్‌ నిర్ణయాన్ని తప్పుపట్టేలా కీలక వ్యాఖ్యలు చేశారు. 'మన్‌ కీ బాత్' కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రధాని మాతృభాషల ప్రాధాన్యాన్ని తెలియజేశారు.

అమ్మభాషతోనే అభివృద్ధి సాధ్యమన్నారు మోదీ. ఐక్య రాజ్య సమితి కూడా మాతృభాషల ప్రాధాన్యాన్ని గుర్తించిందని... అందుకే ఈ ఏడాదిని 'అంతర్జాతీయ మాతృభాషల సంవత్సరం'గా ప్రకటించిందని గుర్తు చేశారు. ఉత్తరాఖండ్‌లోని దారుచులా ప్రాంతంలో రంగ్ జాతి ప్రజలు లిపి లేని తమ భాష 'రంగ్లో' ను పరిరక్షించేందుకు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు ప్రధాని. పదివేల వరకు ఉండే ఆ జాతి ప్రజలు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని మరీ భాషాభివృద్ధికి పాటుపడుతున్నారని కొనియాడారు. ఇది అందరికీ స్ఫూర్తి కావాలని, ఎవరి భాషను వారు, వారి యాసతో ఉపయోగించడం ప్రారంభించాలని మోడి సూచించారు. ఎంత అభివృద్ధిని సాధించినా మాతృభాషను విస్మరిస్తే దానికి అర్థం ఉండదని మోడి పేర్కొన్నారు.మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం మోదీ వ్యాఖ్యల్ని ఊటంకిస్తూ ఓ ట్వీట్ చేశారు. మరి మోదీ వ్యాఖ్యలకు వైసీపీ సమూహాలు, సీఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాలని ట్వీట్ పెట్టారు.First published: November 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>