మిషన్ శక్తిని చిన్నదిగాచూపే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మోదీ. మిషన్ శక్తిని థియేటర్ సెట్గా అభివర్ణించిన రాహుల్ గాంధీ తీరును ఆయన తప్పుబట్టారు.
దేశంలో ఎండల వేడితో పాటు ఎన్నికల వేడి రాజుకుంది. తొలిదశ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. సుడిగాలి పర్యటనలు, బహిరంగ సభలతో జనాల్లో కలియతిరుగుతున్నారు నేతలు. ఉత్తర్ ప్రదేశ్లోని మీరట్లో పర్యటించిన ప్రధాని మోదీ..ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ కూటమిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ కూటమి మద్యంలాంటిదని..ప్రజలకు హానికరమని సెటైర్లు వేశారు. అక్రమ కూటమిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
గతంలో శత్రువులుగా ఉన్న నేతలు ఇప్పుడు మిత్రులుగా ఉన్నారు. సమాజ్వాదీ పార్టీలోని 'స', రాష్ట్రీయ్ లోక్దళ్లోని 'రా', బహుజన్ సమాజ్వాదీ పార్టీలోని 'బ' కలిపితే షరాబ్ (మద్యం). ఈ కూటమి ప్రజలకు హానికరం. మీ జీవితాలను నాశనం చేస్తుంది. యూపీ ఆరోగ్యం కోసం, దేశ భవిష్యత్ కోసం ఈ పార్టీలు దూరంగా ఉంటే మంచిది.
— నరేంద్ర మోదీ, భారత ప్రధాని
కాంగ్రెస్ ప్రకటించిన కనీస ఆదాయ పథకంపైనా ప్రధాని సెటైర్లు వేశారు. గతంలో పేద ప్రజలకు బ్యాంకు అకౌంట్లు ఇవ్వని నేతలు..ఇప్పుడు నేరుగా ఖాతాల్లో డబ్బులు వేస్తామంటున్నారని విమర్శించారు. మిషన్ శక్తిని చిన్నదిగాచూపే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మోదీ. మిషన్ శక్తిని థియేటర్ సెట్గా అభివర్ణించిన రాహుల్ గాంధీ తీరును ఆయన తప్పుబట్టారు. భూమి మీదైనా, ఆకాశమైనా, ఆఖరికి అంతరిక్షమైనా.. సర్జికల్ స్ట్రైక్ చేసే సాహసం మీ కాపలాదారుడు మాత్రమే చేశాడని స్పష్టంచేశారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.