ఆయన దయ వల్లే జగన్‌ గెలిచారు.. జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు

నేతలు, కార్యకర్తల వలసలపై మాట్లాడిన జేసీ.. పోలీసుల కేసులు భరించలేకే టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరుతున్నారని విమర్శించారు.

news18-telugu
Updated: October 15, 2019, 9:04 PM IST
ఆయన దయ వల్లే జగన్‌ గెలిచారు.. జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు
వైఎస్ జగన్, జేసీ దివాకర్ రెడ్డి
  • Share this:
మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి వీలు చిక్కినప్పుడల్లా సీఎం జగన్‌పై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. తాజాగా మరోసాని జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జేసీ. జగన్‌కు పరిపాలనా అనుభవం లేదని.. ఆయనకు మంచి చెడు చెప్పేవాళ్లు లేరని వ్యాఖ్యానించారు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్న చందంగా పరిపాలన సాగిస్తున్నారని సెటైర్లు వేశారు. ఓ వైపు చురకలంటిస్తూనే .. జగన్ మంచీచెండూ రెండూ చేస్తున్నాడని అభిప్రాయపడ్డారు.

ఇంకో ఆరు నెలలు, ఏడాది పూర్తైతే తప్ప జగన్ ఎలా పరిపాలిస్తున్నాడో ఓ అంచనాకు రాలేమని చెప్పారు జేసీ. ప్రధాని నరేంద్ర మోదీ దయ వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ భారీ మెజార్టీతో గెలిచారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ చేతుల్లో ఉన్న మంత్ర దండం షిర్డి సాయి కన్నా శక్తివంతమైనదని అభిప్రాయపడ్డారు. ఇక నేతలు, కార్యకర్తల వలసలపై మాట్లాడిన జేసీ.. పోలీసుల కేసులు భరించలేకే టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరుతున్నారని విమర్శించారు.
First published: October 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading