మూడు రాజధానులపై సీఎం జగన్‌కు బీజేపీ షాక్...

వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశం కాక రేపుతోంది. ఏకపక్షంగా చేపట్టిన మూడు రాజధానులకు బీజేపీ మద్దతు లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశం కాక రేపుతోంది. ఏకపక్షంగా చేపట్టిన మూడు రాజధానులకు బీజేపీ మద్దతు లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తో చర్చించామని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దియోధర్ చెప్పారు. ‘అమరావతి నుంచి రాజధానిని తరలించాలని ఏకపక్షంగా వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తాము తీసుకునే మూర్ఖపు నిర్ణయాన్ని సమర్ధించుకోలేక దానిపై కేంద్రం తో చర్చించామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అటు చంద్రబాబు,ఇటు వైఎస్ జగన్ అబద్ధాల ప్రచారంలో దొందూ-దొందే.’ అని తెలుగులో ట్వీట్ చేశారు. దీనికి అనుబంధంగా ఓ ఫొటోను కూడా జోడించారు.    మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాన్ కూడా అదే ఫొటోను ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల కాన్సెప్ట్‌కు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అంగీకారం తెలిపిందంటూ వైసీపీ, ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published: