దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం.. అయోధ్య తీర్పుపై మోదీ

నవంబర్ 9ను గొప్ప రోజుగా ప్రధాని మోదీ అభివర్ణించారు. కలసిమెలసి సాగే రోజుగా ఆకాంక్షించారు. ఇదే రోజున బెర్లిన్ గోడను కూల్చేసి తూర్పు, పశ్చిమ బెర్లిన్ ప్రజలు ఒక్కటయ్యారన్నారు మోదీ.

news18-telugu
Updated: November 9, 2019, 10:12 PM IST
దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం.. అయోధ్య తీర్పుపై మోదీ
ప్రధాని మోదీ
  • Share this:
అయోధ్య తీర్పుపై జాతినుద్దేశించి ప్రసగించారు ప్రధాని మోదీ. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించిందని. .. దశాబ్దాల నాటి వివాదానికి అందరికీ ఆమోదయోగ్యమైన ముగింపు ఇచ్చారని అన్నారు.  దేశ చరిత్రలో ఇది సువర్ణాధ్యాయమని కొనియాడారు మోదీ. కోర్టు తీర్పును అన్నివర్గాల ప్రజలు స్వీకరించడం అభిలషణీయమని చెప్పారు. ఆ రకంగా భారత ప్రజాస్వామ్యం ఎంత బలమైందో ఇవాళ ప్రపంచం చూసిందన్నారు ప్రధాని. భిన్నత్వంలో  ఏకత్వానికి ఇవాళ్టి పరిస్థితులే నిదర్శనమన్నారు . భారత న్యాయవ్యవస్థపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని పేర్కొన్నారు.

చరిత్రలో ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిందని ప్రధాని మోదీ అన్నారు. సుప్రీంకోర్టులో ఐదుగురు జడ్జిలు ఏకాభిప్రాయంతో తీర్పు చెప్పడం చరిత్రాత్మక విషయమన్నారు. అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు దృఢచిత్తంతో వ్యవహరించిందని ప్రశంసించారు. ఈ ప్రక్రియలో పాలుపంచుకున్న అందరినీ అభినందించాలన్నారు మోదీ.  ఇవాళ్టి తీర్పుతో భారత్ ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో ప్రపంచానికి మరోసారి అర్ధమైందన్నారు ప్రధాని.  నవంబరు 9న అయోధ్య తీర్పుతో పాటు కర్తార్‌పూర్ కారిడార్ కూడా ప్రారంభమైందని గుర్తు చేశారు.

నవంబర్ 9ను గొప్ప రోజుగా ప్రధాని మోదీ అభివర్ణించారు. కలసిమెలసి సాగే రోజుగా ఆకాంక్షించారు. ఇదే రోజున బెర్లిన్ గోడను కూల్చేసి తూర్పు, పశ్చిమ బెర్లిన్ ప్రజలు ఒక్కటయ్యారన్నారు మోదీ. ఇదే రోజు భారత్ - పాకిస్తాన్ మధ్య కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభించడం మరింత ముదావహమని చెప్పారు. సుమారు 11 నిమిషాల పాటు అయోధ్య తీర్పు, కర్తార్‌పూర్ కారిడార్ అంశాలపై జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధాని మోదీ.

  

 

  

 
First published: November 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>