‘పద్మారావు అనుచరుల నుంచి గుడిని కాపాడండి..’

డబ్బులు తీసుకొని స్థలాన్ని వదిలేయాలంటూ కుమారుడు హితబోధ చేశాడని చెప్పారు. 33 సంవత్సరాల నుంచి ఉన్న గుడిని, ఆ స్థలాన్ని కాపాడాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.

news18-telugu
Updated: September 29, 2019, 6:25 PM IST
‘పద్మారావు అనుచరుల నుంచి గుడిని కాపాడండి..’
ఆలయ స్థలంలో భక్తులు, స్థానికులు
  • Share this:
‘తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మరావు కుమారులు, అనుచరుల నుంచి గుడిని కాపాడండి’ అంటున్నారు ఆయన సొంత నియోజకవర్గ ఓటర్లు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఓ  గుడికి సంబంధించిన స్థలాన్ని అక్రమించుకోడానికి ఆయన అనుచరులు ప్రయత్నిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. గుడి స్థలాన్ని కబ్జా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న అనుచరులను డిప్యూటీ స్పీకర్ పద్మారావు కుమారులు మద్దతు పలుకుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆలయ చైర్మన్ పరమేశ్వర్ ను గుడి వద్దకు పిలుపించి బెదిరించి డిప్యూటీ స్పీకర్ ఇంటికి తీసుకెళ్లారు అనుచరులు. పద్మరావు నివాసంలో ఆయన కుమారులు మరోసారి చైర్మన్ ను బెదిరించారని చెబుతున్నారు. డబ్బులు తీసుకొని స్థలాన్ని వదిలేయాలంటూ కుమారుడు హితబోధ చేశాడని చెప్పారు. 33 సంవత్సరాల నుంచి ఉన్న గుడిని, ఆ స్థలాన్ని కాపాడాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.

First published: September 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>