Andhra Pradesh: కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత పనులు, రాజకీయాలు, నియోజకవర్గం సమస్యలు.. పార్లమెంట్ సమావేశాలు.. ఎమ్మెల్యేలతో సమన్వయం ఇలా.. నిత్యం బిజీగా ఉండే మహిళ ఎంపీలు సరదగా సందడి చేశారు. ఒక్కసారిగా గిరిజన సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. తిరగలి తిప్పుతూ.. రోకలిలో సామలు దంచుతూ.. అచ్చం గిరిజన మహిళల్లా కాసేపు సమయం గడిపారు. ఇంతకీ ఎవరా ఎంపీలు..? ఎందుకలా చేశారో చూడండి.. ఈ ముగ్గురు ఎంపీలు ఎవరో కాదు.. అరకు ఎంపీ మాధవి(Araku MP Madhavi) . కాకినాడ ఎంపీ వంగా గీత (Kakinad MP Vanga Geetha). వీరిద్దరు వైసీపీ ఎంపీలు (YCP MPs)గా కాగా.. మరొకరు కేరళ రాష్ట్రానికి చెందిన అల్తూరు ఎంపీ రమ్య హరిదాస్ (MP Ramya das). ఆమె సరదగా అరకు (Araku) పర్యటనకు వచ్చారు. తనతో పాటు స్నేహంగా ఉండే వంగా గీతను కూడా రమ్మని చెప్పారు. దీంతో వంగా గీత, రమ్య హరిదాస్ కు సాదరంగా ఆహ్వానం పలికారు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.. అరకు రూరల్ మండలంలో పెదలబుడులో నిర్మించిన గిరిజన సాంప్రదాయం ప్రతిబింబించే గిరి గ్రామదర్శిని సందర్శనకు ఆ ఇద్దరి ఎంపీలను తీసుకెళ్లారు. సహచర ఎంపీలను తమ సాంప్రదాయాన్ని తెలిపేలా అరకు ఎంపీ మాధవి స్వయంగా గిరిజన సాంప్రదాయ దుస్తులను ధరించారు. దీంతో సహచర ఎంపీలు వంగా గీత, రమ్య హరిదాస్ కూడా గిరిజన సాంప్రదాయ వేషధారణకు మంత్ర ముగ్దులయ్యారు. వాళ్ళు కూడా అలాంటి వస్త్రాలు ధరించి గిరిజన మహిళల్లా ముస్తాబయ్యారు.
గిరి గ్రామదర్శిని గురించి.. అక్కడ సాంప్రదాయాల గురించి ఎంపీ మాధవి స్వయంగా వారికి వివరించారు. అక్కడే రోకలి దంచుతూ.. తిరగలి తిప్పారు. వనదేవతకు పూజలు చేశారు. అక్కడ ఉన్నంత సేపు గిరిజనుల్లా మారిపోయారు. వారి సందడి చూసి స్థానికులు కూడా షాక్ కు గురయ్యారు. ఎంపీలు అయ్యి ఉండి తమలో వారు కలిసిపోవడంతో ఆనందంగా గడిపారు.
ఈ మహిళా ఎంపీలను గుర్తు పట్టారా..? #YSRCPMarkVictory #YCP #Vizag @arakucoffeein @_Arakunrin @WomenMPs
Please Identify these Women MPS || ఈ ముగ్గురు ఎంపీలను గుర్తు పట్టగలరా=||... https://t.co/qMcCINwrrr via @YouTube
— nagesh Journlist (@nageshzee) September 22, 2021
ఇంత సందడి చేసిన తరువాత ధింసా చేయకుండా ఉంటే ఎలా..? అందుకే స్థానిక గిరిజన మహిళలతో కలిసి ముగ్గురు మహిళా ఎంపీలు ధింసా నృత్యం చేశారు. కనుమరుగవుతున్న గిరిజన సాంప్రదాయం కళ్ళకు కట్టినట్టు ప్రదర్శించే గిరి గ్రామదర్శిని తిలకించి… గిరి సాంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ ఎంపీలు గుర్తు చేశారు.
ఇదీ చదవండి: ఇంత శాడిజమా? భార్య ఆత్మహత్య వీడియో తీసి పైశాచిక ఆనందం
కాగా గిరి గ్రామదర్శినిని సందర్శించడం కొత్త అనుభూతిని కలిగించిందన్నారు ఎంపీలు వంగా గీత, రమ్య హరిదాస్. గిరిజన ఆచార వ్యవహారాలు, వారి జీవనస్థితిగతులు, ఇతరత్రా వివరాలు తెలుసుకోవాలనుకునే ఔత్సాహికులు, సందర్శకులకు గిరి గ్రామదర్శిని మంచి వేదిక అని కితాబునిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Araku, Visakhapatnam, Vizag, Ycp