Plastic ban: ప్లాస్టిక్ కవర్లు అమ్మినందుకు రూ.25వేలు జరిమానా.. మీరూ జాగ్రత్త

Plastic ban: నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను అమ్ముతున్నందుకు గానూ షాప్ యజమానికి ఏకంగా రూ.25వేలు జరిమానా విధించారు.

news18-telugu
Updated: October 16, 2019, 4:22 PM IST
Plastic ban: ప్లాస్టిక్ కవర్లు అమ్మినందుకు రూ.25వేలు జరిమానా.. మీరూ జాగ్రత్త
ప్లాస్టిక్ షాప్‌ యజమానికి జరిమానా
  • Share this:
ప్లాస్టిక్ వాడకంపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. అక్టోబరు 2 నుంచి సింగిల్ యూస్ (ఒకసారి మాత్రమే వాడగలిగే) ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. ప్లాస్టిక్ బ్యాగులు, కప్పులు, ప్లేట్లు, చిన్న బాటిల్స్, స్ట్రాలు, శాషేలను ఇకపై ఉత్పత్తి చేయకూడదు. వాడకూడదు. నిల్వ చేయకూడదు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణలోనూ సింగిల్ యూస్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని ఇటీవలే సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సీఎం ఆదేశాలతో రంగలోకి దిగిన అధికారులు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ప్లాస్టిక్ కవర్లను అమ్ముతున్న వారిపై జరిమానాలు విధిస్తున్నారు.

తాజాగా సికింద్రాబాద్ పరిధిలోని లాలగూడలో తనిఖీలు చేపట్టారు. త్రివేణి ప్లాస్టిక్ షాప్‌‌లో 50 మైక్రాన్స్ కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ కోటెడ్ ప్లేట్లు, సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తువులు అమ్ముతున్నారని గుర్తించారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను అమ్ముతున్నందుకు గానూ షాప్ యజమానికి ఏకంగా రూ.25వేలు జరిమానా విధించారు. జీహెచ్ఎంసీ అధికారులు షాప్ యజమానికి జరిమానా విధించారు. సింగిల్ ప్లాస్టిక్‌ను అమ్మినా.. వినియోగించినా.. భారీగా జరిమానాలు విధిస్తామిన నగరవాసులను హెచ్చరించారు అధికారులు.

జీహెచ్ఎంసీ జరిమానా
First published: October 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading