మెట్రో రైలు, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం..?

2020లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహిళా ఓటర్లపై వరాలు జల్లు కురిపించే అవకాశముంది. అందుకోసం ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తోంది.

news18-telugu
Updated: June 3, 2019, 6:30 AM IST
మెట్రో రైలు, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం..?
ట్రైన్‌లో ఉన్న ప్రయాణికులను లక్డీకాపూల్ మెట్రో స్టేషన్‌లో దించేశారు. మళ్లీ వెనక్కు వెళ్లారు.
  • Share this:
ఢిల్లీ వాసులకు కేజ్రీవాల్ ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పే అవకాశముంది. ఢిల్లీలో మహిళలకు మెట్రో రైలు, బస్సు సేవలు ఉచితంగా అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ఈ మేరకు ఆప్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆదివారం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) అధికారులతో ఢిల్లీ రవాణాశాఖమంత్రి కైలాశ్ గెహ్లాట్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా సూచించారు. వీలైనంత త్వరగా నివేదికను సిద్ధంచేసి అందించాలని ఆదేశించారు.


ప్రస్తుతం కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు DMRCలో 50 శాతం చొప్పున భాగస్వామ్యం ఉంది. ఐతే ఢిల్లీ మెట్రోపై పూర్తి అధికారాలు తమకు సంక్రమిస్తే చార్జీలను భారీగా తగ్గిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అంతేకాదు 2020లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహిళా ఓటర్లపై వరాలు జల్లు కురిపించే అవకాశముంది. అందుకోసం ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తోంది. ముందుగా ఢిల్లీ మెట్రో రైలు, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందించాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి అతి త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశముంది.
Published by: Shiva Kumar Addula
First published: June 3, 2019, 6:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading