• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • PIL FILED IN SUPREME COURT TO HOLD ELECTIONS IN WEST BENGAL BA

West Bengal: బెంగాల్లో ఎన్నికలు ఆపేయాలంటూ సుప్రీంకోర్టులో పిల్..

West Bengal: బెంగాల్లో ఎన్నికలు ఆపేయాలంటూ సుప్రీంకోర్టులో పిల్..

సుప్రీంకోర్టు (ఫైల్ ఫొటో)

పశ్చిమ బెంగాల్లో ఎనిమిది దశల ఎన్నికల నిర్వహణను తప్పపడుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఎంఎల్ శర్మ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని, కాబట్టి ఎన్నికల కమిషన్ దీన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు.

  • Share this:
    పశ్చిమ బెంగాల్లో ఎనిమిది దశల ఎన్నికల నిర్వహణను తప్పపడుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఎంఎల్ శర్మ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 21‌ను ఉల్లంఘించడమేనని, కాబట్టి ఎన్నికల కమిషన్ దీన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు. ఫిబ్రవరి 26న కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుర్చేరి అసెంబ్లీలకు సీఈసీ సునీల్ అరోరా షెడ్యూల్ ప్రకటించారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకేదశలో ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. అసోంలో మూడుదశల్లో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లో 8 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు సీఈసీ ప్రకటించారు. 2016లో పశ్చిమ బెంగాల్లో ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి.

    ఈ పిటిషన్ త్వరలో సుప్రీంకోర్టు ముందుకు విచారణకు రానుంది. ఎన్నికలు నిలిపివేయాలనడంతో పాటు ఎన్నికల ప్రచారంలో మతపరమైన నినాదాలు చేసే వారి మీద సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశించాలని కోరారు. ‘జై శ్రీరామ్’ అనే నినాదాలు చేయడం వల్ల ఇతర మతస్తుల మధ్య సుహృద్భావ వాతావరణం దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలా చేయడం ప్రజాప్రతినిధ్య చట్టం 1951 ప్రకారం తప్పు అని, అలాగే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కూడా నేరమని ఆ పిటిషన్‌లో అన్నారు.

    అసోంలో మూడు దశల్లో ఎన్నికలు

    మొదటి దశ ఎన్నికలు మార్చి 27

    రెండో దశ పోలింగ్ మార్చి ఏప్రిల్ 1

    మూడో దశ ఎన్నికలు ఏప్రిల్ 6

    కేరళలో ఒకే దశలోనే ఎన్నికలు. పోలింగ్ తేదీ - ఏప్రిల్ 6

    తమిళనాడులో ఒకే దశలోనే ఎన్నికలు. పోలింగ్ తేదీ - ఏప్రిల్ 6

    పుదుచ్చేరిలో ఒకే దశలోనే ఎన్నికలు. పోలింగ్ తేదీ - ఏప్రిల్ 6

    పశ్చిమ బెంగాల్లో ఎనిమిది దశల్లో ఎన్నికలు

    మొదటి దశ ఎన్నికలు - మార్చి 27
    రెండో దశ ఎన్నికలు - ఏప్రిల్ 1
    మూడో దశ ఎన్నికలు - ఏప్రిల్ 6
    నాలుగో దశ ఎన్నికలు - ఏప్రిల్ 10
    ఐదో దశ ఎన్నికలు - ఏప్రిల్ 17
    ఆరో దశ ఎన్నికలు - ఏప్రిల్ 22
    ఏడో దశ ఎన్నికలు - ఏప్రిల్ 26
    ఎనిమిదో దశ ఎన్నికలు - ఏప్రిల్ 29

    అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికల ఫలితాలు ప్రకటించే తేదీ - మే 2న
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు