ఎవరికి ఓటేశారు ? గోదావరి జిల్లాల ఓటర్లకు ఫోన్ కాల్స్

ఏపీలో అధికారం ఎవరికి దక్కుతుందనే అంశాన్ని తేల్చబోయేది ఉభయ గోదావరి జిల్లాలే అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ రెండు జిల్లాలు ఏ పార్టీకి జై కొడితే... ఆ పార్టీకి అధికారం ఖాయమనే వాదన ఉంది.

news18-telugu
Updated: April 23, 2019, 4:00 PM IST
ఎవరికి ఓటేశారు ? గోదావరి జిల్లాల ఓటర్లకు ఫోన్ కాల్స్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 23, 2019, 4:00 PM IST
ఏపీ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటేశారనే విషయం తెలుసుకోవడానికి రాజకీయ పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నాయి. ఈ సారి తాము మళ్లీ గెలుస్తామా అని టీడీపీ... ఈసారైనా తమకు అధికారం వస్తుందా అని వైసీపీ నేతలు తెగ టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎవరికి ఓటు వేశారనే విషయం తెలుసుకోవడానికి మరోసారి సర్వేలను నమ్ముకుంటున్నారు కొందరు నేతలు. మిగతా జిల్లాల సంగతి ఎలా ఉన్నా... ప్రధాన రాజకీయ పార్టీలు గోదావరి జిల్లాల ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపారనే విషయం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఏపీలో అధికారం ఎవరికి దక్కుతుందనే అంశాన్ని తేల్చబోయేది ఉభయ గోదావరి జిల్లాలే అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ రెండు జిల్లాలు ఏ పార్టీకి జై కొడితే... ఆ పార్టీకి అధికారం ఖాయమనే వాదన ఉంది. గత ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో మెజార్టీ సీట్లు టీడీపీకి రావడం వల్లే... ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈ సారి ఉభయ గోదావరి జిల్లాల్లో తమకే మెజార్టీ సీట్లు వస్తాయని వైసీపీ భావిస్తోంది. అయితే ఈ రెండు జిల్లాల్లో ప్రధాన పార్టీల ఫలితాలను తారుమారు చేసే స్థాయిలో పవన్ కళ్యాణ్ జనసేన ఉండటంతో... ఈ రెండు జిల్లాల ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపారనే విషయంపై ఆసక్తి నెలకొంది.

మరోవైపు కొద్దిరోజుల నుంచి గోదావరి జిల్లాల ఓటర్లకు సర్వే పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కాల్స్ హైదరాబాద్, బెంగళూరు నుంచి వస్తున్నాయని కొందరు చెబుతున్నారు. అయితే బెటింగ్స్ కోసం బుకీలు కూడా ఇలాంటి పనులు చేస్తుంటారనే టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఎన్నికలకు ముందు మాకు ఓటేయండి అంటూ ఓటర్లను వేధించిన ఫోన్ కాల్స్... ఇప్పుడు ఎవరికి ఓటు వేశారంటూ పదే పదే ఫోన్ చేసి అడగడం చికాకు తెప్పిస్తోంది.First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...