చంద్రబాబుపై హైకోర్టులో పిటిషన్... విచారణ 18కి వాయిదా

రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు ప్రభుత్వ నిధులు వినియోగించారని రిపబ్లిక్ పార్టీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

news18-telugu
Updated: June 14, 2019, 3:46 PM IST
చంద్రబాబుపై హైకోర్టులో పిటిషన్... విచారణ 18కి వాయిదా
చంద్రబాబు (File)
news18-telugu
Updated: June 14, 2019, 3:46 PM IST
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు ప్రభుత్వ నిధులు వినియోగించారని రిపబ్లిక్ పార్టీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికలకు ముందు ఓటర్ల అకౌంట్‌లో వేసిన పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ నిధులతో వారిని ప్రభావం చేశారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా... ప్రభుత్వ సొమ్మును వ్యక్తిగత అకౌంట్లలోకి ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఇలా చేయడం ఓట్లను కొనుగోలు చేయడమే అవుతుందని ఆరోపించారు. ఈ రెండు పథకాల పేరుతో వ్యక్తిగత అకౌంట్లలో వేసిన డబ్బులను చంద్రబాబు చేసిన ఖర్చులుగానే గుర్తించాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు... కేసు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో ధర్మపోరాట దీక్షల పేరుతో చంద్రబాబు ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారంటూ దాఖలైన పిటిషన్‌ను కూడా హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై కూడా త్వరలోనే విచారణ జరగనుంది.


First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...